న్యూఢిల్లీ: స్నేహితులతో కలిసి కరీబియన్ దీవుల్లో విహారయాత్రకు వెళ్లి అదృశ్యమైన భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి కేసు దర్యాప్తు అధికారులకు అంతు చిక్కటం లేదు. ఆమెకు చెందినవిగా భావిస్తున్న దుస్తులు ఇక్కడి బీచ్‌లోని లాంజ్ కుర్చీ వద్ద కనిపించాయని, వారం క్రితం అక్కడే ఆమె కనిపించకుండా పోయారని న్యూయార్క్ పోస్ట్ కథనం తాజాగా తెలిపింది.
నిఘా కెమెరాల్లో చివరిసారి ఆమెతో కనిపించిన (మార్చి 6న) జోష్ రీబ్ అనే అతన్ని అధికారులు విచారిస్తున్నారు. సుదీక్ష కోణంకి సముద్రంలో మునిగిపోయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.