మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Jul 18, 2020 , 22:03:39

థాయిలాండ్ లో మిన్నంటిన ఆందోళనలు

థాయిలాండ్ లో మిన్నంటిన ఆందోళనలు

బ్యాంకాక్ : థాయిలాండ్ లో ఆందోళనలు మిన్నంటాయి. ప్రభుత్వం రాజీనామా చేయాలని, పార్లమెంటును రద్దు చేయాలని డిమాండ్ థాయిలాండ్ అంతటా వినిపిస్తున్నది. శనివారం సాయంత్రం వందలాది మంది ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. బ్యాంకాక్ డెమోక్రసీ మాన్యుమెంట్ సమీపంలో విద్యార్థుల నేతృత్వంలో ర్యాలీ కొనసాగింది. 2014 సైనిక తిరుగుబాటు తరువాత జరిగిన అతిపెద్ద వీధి ప్రదర్శనలలో ఒకటిగా పేర్కొనవచ్చు. కరోనా వైరస్ నిషేధాన్ని ధిక్కరించి మరీ పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు తరలివచ్చారు. 

పార్లమెంటును తక్షణమే రద్దు చేయాలన్నది థాయి ప్రజలు చేస్తున్న డిమాండ్లలో మొదటిది. ప్రభుత్వాన్ని విమర్శించేవారిని వేధించడానికి ముగింపు పలకడం, సైనిక-వ్రాతపూర్వక రాజ్యాంగానికి సవరణలు చేయడం వంటివి డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. 

ప్రయూత్ పాలనపై ప్రజల వ్యతిరేకత ఇటీవలి నెలల్లో పెరుగుతున్నది. గత ఏడాది ఎన్నికల నుంచి రెండో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీని కోర్టు రద్దు చేసింది. పార్లమెంటులో ప్రయూత్ పాలక సంకీర్ణానికి గట్టి నియంత్రణ ఇచ్చింది. అంతర్గత వివాదాలపై గురువారం అనేక మంది క్యాబినెట్ సభ్యులు రాజీనామా చేశారు. ప్రయూత్ యొక్క పలాంగ్ ప్రచారత్ పార్టీ సాంప్రదాయ థాయ్ సంస్కృతి, రాజు మహా వజీరాలోంగ్ కార్న్ పట్ల విధేయత గురించి ప్రచారం చేసింది. థాయిలాండ్ లో రాచరికం అధికారికంగా రాజ్యాంగబద్ధమైన. కానీ రాజును అవమానించినవారికి 15 ఏండ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. చాలా మంది సంప్రదాయవాదులు రాచరికంను పవిత్రమైనదిగా భావిస్తారు.

శనివారం నాటి నిరసనలో రాచరికం గురించిన  కొన్ని సంకేతాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆందోళనకారులు “ది పీపుల్స్ పార్టీ ఈజ్ డెడ్”  అనే బ్యానర్ ను ప్రదర్శించారు. 70 ఏండ్లు పాలించిన తన తండ్రి 2016 లో మరణించిన తరువాత రాజు వజీరాలోంగ్‌కార్న్ సింహాసనాన్ని అధిష్టించాడు.


logo