Elon Musk | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వంలో కీలక డోజ్ శాఖ అధిపతిగా వ్యవహరిస్తున్న టెక్ టైకూన్, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) భారత పర్యటనకు రాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఎలాన్ మస్క్‌తో ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ టెస్లా బాస్ నుంచి ఈ ప్రకటన రావడం విశేషం. ‘ప్రధాని మోదీతో మాట్లాడటం గౌరవంగా ఉంది. ఈ ఏడాది చివర్లో భారతదేశాన్ని సందర్శించడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
SpaceX Founder & CEO and US DOGE chief Elon Musk replies to PM Modi’s earlier post on ‘X’
“It was an honour to speak with PM Modi. I am looking forward to visiting India later this year,” reads the post pic.twitter.com/rpRkBYRj3S
— ANI (@ANI) April 19, 2025
ఎలాన్ మస్క్‌తో ప్రధాని మోదీ శుక్రవారం ఫోన్లో సంభాషించిన విషయం తెలిసిందే. సాంకేతికత, నూతన ఆవిష్కరణల్లో సహకారం, భాగస్వామ్యం గురించి వారు చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఎలాన్ మస్క్‌తో పలు అంశాలపై మాట్లాడినట్లు చెప్పారు. ఈ ఏడాది ఆరంభంలో యూఎస్ పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీలో మస్క్‌తో భేటీలో చర్చకు వచ్చిన అంశాలను ప్రస్తావించినట్లు చెప్పారు. సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న ప్రాముఖ్యతపై చర్చించినట్లు తెలిపారు. ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉంది అంటూ ప్రధాని ఎక్స్‌లో పోస్టు పెట్టారు. టారిఫ్‌ల విషయంలో భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చల అంశం కొనసాగుతోన్న వేళ వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణ ఆసక్తికరంగా మారింది.
Also Read..
Bobby Simha | తెలుగు నటుడి కారు బీభత్సం.. వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఇద్దరికి గాయాలు
Dilip Ghosh | 60 ఏళ్ల వయసులో ప్రేయసిని పెళ్లాడిన బీజేపీ నేత.. ఫొటోలు వైరల్
Earthquake | అఫ్ఘానిస్థాన్‌లో మరోసారి భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు