Earthquake | అఫ్ఘానిస్థాన్ (Afghanistan)లో మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. శనివారం మధ్యాహ్నం 12:17 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ( National Center for Seismology) వెల్లడించింది. అఫ్ఘానిస్థాన్ – తజికిస్థాన్ సరిహద్దుల్లో (Afghanistan-Tajikistan border) భూమికి 130 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.
EQ of M: 5.8, On: 19/04/2025 12:17:53 IST, Lat: 36.10 N, Long: 71.20 E, Depth: 130 Km, Location: Afghanistan.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/Ar2EoIRFLH— National Center for Seismology (@NCS_Earthquake) April 19, 2025
ఈ భూ ప్రకంపనలతో భవనాలు ఊగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రకంపనల ధాటికి భారత్‌లోనూ భూమి కంపించింది. కశ్మీర్ (Kashmir), ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కాగా, అఫ్ఘాన్‌లో వచ్చిన భూకంపానికి సంబంధించిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
#WATCH | An earthquake of magnitude 5.8 on the Richter scale hit Afghanistan at 12:17 PM (IST); tremors also felt in parts of Jammu and Kashmir
(Visuals from Poonch) pic.twitter.com/PQP8Ektldi
— ANI (@ANI) April 19, 2025
మరోవైపు అఫ్ఘానిస్థాన్‌లో మూడు రోజుల వ్యవధిలోనే భూమి కంపించడం ఇది రెండోసారి. ఈనెల 16వ తేదీన కూడా అక్కడ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో బుధవారం తెల్లవారుజామున భూమి కంపించింది. బాగ్లాన్ నగరానికి 164 కిలోమీటర్ల దూరంలో 121 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇప్పుడు అదే తీవ్రతతో మరోసారి భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
#WATCH | An earthquake of magnitude 5.8 on the Richter scale hit Afghanistan at 12:17 PM (IST); tremors also felt in parts of Jammu and Kashmir
A local in Srinagar says, “…I felt the tremor. I was in the office when my chair shook…” pic.twitter.com/JvEAuoeoTk
— ANI (@ANI) April 19, 2025
Also Read..
Kedarnath Dham | మే 2న కేదార్నాథ్, మే 4న బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్ : టెంపుల్ కమిటీ
Dilip Ghosh | లేటు వయసులో పెళ్లి చేసుకున్న బీజేపీ నేత దిలీప్ ఘోష్..! శుభాకాంక్షలు తెలిపిన నేతలు..