Dilip Ghosh | బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ పశ్చిమ బెంగాల్ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ (60) ఓ ఇంటివారయ్యారు. కోల్‌కతాకు దగ్గరలోని ఆయన నివాసంలో కుటుంబీకులు, దగ్గరి సన్నిహితుల సమక్షంలో అదే పార్టీకి చెందిన రింకూ మజుందార్ (51)ను సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం కొత్త దంపతులు మీడియాతో మాట్లాడారు. తన తల్లి కోరిక మేరకే తాను ఈ వయసులో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని దిలీప్ ఘోష్ వెల్లడించారు. రాజకీయ జీవితంపై వ్యక్తిగత జీవితం ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు. దిలీప్ ఘోష్‌కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు పలువురురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. దిలీప్ ఘోష్, రింకు మజుందార్ తొలిసారిగా 2021లో ఎకో పార్క్‌లో వాకింగ్ చేస్తున్న సమయంలో కలిశారు.
ఈ నెలలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కలుసుకున్న ఇద్దరు.. అప్పుడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఘోష్ ప్రతిపాదించిన పెళ్లికి.. రింకు మజూందార్ వెంటనే అంగీకరించారు. దిలీప్ ఘోష్‌కు ఇదే మొదటి వివాహం కాగా.. రింకూ మంజూదార్కు రెండో వివాహం. ఆమెకు ఇప్పటికే ఓ కొడుకు సైతం ఉన్నాడు. పెళ్లికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ హాజరవగా.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ లేఖలో శుభాకాంక్షలు తెలుపుతూ.. పుష్పగుచ్ఛాలు పంపారు. పెళ్లికి టీఎంసీ నేతలు సైతం హాజరైన అభినందనలు తెలిపారు. దిలీప్ ఘోష్ సుదీర్ఘకాలం ఆర్ఎస్ఎస్లో సేవలందించారు. 2015 నుంచి 2021 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు. బెంగాల్లో ప్రధాన పత్రిపక్షంగా బీజేపీని నిలబెట్టడంలో ఆయన ఎంతో కృషి చేశారు.
Former state BJP president Dilip Ghosh got married to Rinku Majumdar, a BJP member and leader. The wedding took place today in the presence of both families as per Hindu rituals.@DilipGhoshBJP pic.twitter.com/Rpl4bPDZUH
— Manish Bhattacharya (INDIA TV)﮷ (@Manish_IndiaTV) April 18, 2025