Bobby Simha | తమిళనాడు చెన్నై (Chennai)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తెలుగు నటుడు, జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా (Bobby Simha) కారు బీభత్సం సృష్టించింది. ఎక్కడుతంగల్ – చెన్నై ఎయిర్పోర్ట్ రోడ్డులో అదుపుతప్పి ముందు వెళ్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాబీ సింహా కారు ఎక్కడుతంగల్ (Ekkaduthangal) నుంచి చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తోంది. ఈ క్రమంలో అలందూర్ మెట్రో స్టేషన్ వైపు ఉన్న కత్తిపార ఫ్లైఓవర్ దిగుతుండగా కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఘటన సమయంలో నటుడు కారులో లేడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
ప్రమాదంలో ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్లు సహా ఆరు వాహనాలు దెబ్బతిన్నాయి. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని డ్రైవర్ పుష్పరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో కారు నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు చెన్నై ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాబీ సింహా.. చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు-2’, రవితేజ ‘డిస్కో రాజా’, రజాకార్ తదితర చిత్రాల్లో నటించారు.
Also Read..
Ajith Kumar | నటుడు అజిత్‌కు మళ్లీ కారు ప్రమాదం.. వీడియో
Prabhas -Anushka | ప్రభాస్‌తో అనుష్క క్లోజ్ ఫొటో.. ఇలా తయారయ్యారెందుకు?
Shine Tom Chacko | డ్రగ్స్ రైడ్.. విచారణకు హాజరైన మలయాళం నటుడు