Ajith Kumar | తమిళ నటుడు అజిత్ మరోసారి కారు ప్రమాదానికి గురయ్యారు. బెల్జియంలోని సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోర్చాంప్స్ రేస్‌లో ఆయన పాల్గొన్నారు. అయితే, రేస్ సమయంలో నియంత్రణ కోల్పోవడంతో ఆయన నడిపిన కారు ట్రాక్ నుంచి పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అజిత్ సురక్షితంగా బయటపడ్డారు. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఇంతకుముందు కూడా అజిత్ రెండు సార్లు కారు ప్రమాదానికి గురయ్యాడు. అయితే అప్పుడు కూడా అజిత్‌కు ఎలాంటి గాయలు కాకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు అజిత్. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలై రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సిమ్రాన్, త్రిష కృష్ణన్ ఇందులో కథానాయికలుగా నటించారు.
#AjithKumarRacing #AjithKumar
Ajith Sir Racing Car Accident: pic.twitter.com/GOn0GADCcw— SUN’S Friday ☀️🌊 (@SUNSFRIDAY) April 19, 2025