Prabhas -Anushka | ప్రభాస్- అనుష్క ఈ జంట పలు సినిమాలలో నటించి బెస్ట్ పెయిర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. వారు సినిమాలలోనే కాదు నిజ జీవితంలోను జట్టు కడితే చూడాలని ఎంతో మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కొన్నాళ్లుగా వారిద్దరి రిలేషన్ గురించి నెట్టింట అనేక వార్తలు హల్చల్ చేస్తుంటాయి. వారిద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని ప్రచారం జరిగింది. అంతేకాదు ఇటీవలే ఏఐతో వీరిద్దరి పెళ్లి ఫొటోలను క్రియేట్ చేయడంతోపాటు వారికి పిల్లలు కూడా ఉన్నట్లు సృష్టించారు. ఇలా ప్రభాస్ అనుష్కలకి సంబంధించి నెట్టింట ఏదో ఒక ప్రచారం నడుస్తూనే ఉంటుంది. అయితే తాజాగా ప్రభాస్, అనుష్క క్లోజ్ ఫొటోలని తెగ వైరల్ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ , అనుష్క హగ్ చేసుకున్నట్టుగా ఉంది.
ఏఐ సాయంతో ఈ ఫొటోలని రూపొందించినట్టు చెబుతున్నారు. ఇది చూసిన నెటిజన్స్.. ఎందుకు రా ఇలా తయారయ్యారు. ఫేక్ ఫొటోలని క్రియేట్ చేసి ఎందుకు ఇలా రచ్చ చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. ఏది ఏమైన ఈ పిక్స్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక ఇప్పటికే ఎన్నోసార్లు డార్లింగ్ పెళ్లి గురించిన చర్చ సోషల్ మీడియాలో వైరలయ్యింది. గత పదేళ్లుగా ప్రభాస్ పెళ్లి గురించి ఏదోక వార్త వస్తూనే ఉంది. ఆ హీరోయిన్‌తో ప్రభాస్ పెళ్లి అని, ఈ హీరోయిన్‌తో ప్రభాస్ పెళ్లి అని, లేదంటే ఆ ఊరి అమ్మాయిని వివాహం చేసుకోనున్నాడని ఇలా ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ప్రభాస్ మాత్రం ఇప్పటికీ తన పెళ్లిపై క్లారిటీ ఇవ్వడం లేదు.
ప్రభాస్, అనుష్క జోడి తెలుగు చిత్రపరిశ్రమలో సూపర్ హిట్. వీరిద్దరు కలిసి మిర్చి, బాహుబలి చిత్రాలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్నారు. త్వరలో ప్రభాస్ స్పిరిట్ అనే చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ఇందులో కూడా అనుష్కని హీరోయిన్గా తీసుకున్నట్టు టాక్ నడుస్తుంది. ఇటీవల అనుష్క సోలో హీరోయిన్గా సినిమాలు చేస్తుంది. ఇప్పుడు ప్రభాస్‌తో జత కట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది.