Donald Trump | భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు మునుపటి బైడెన్ సర్కారు 21 మిలియన్ డాలర్లు కేటాయించడం, తాజాగా ట్రంప్ సర్కారు వాటిని నిలిపివేయడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచడానికి అమెరికా ప్రభుత్వం అందజేసే 21 మిలియన్ డాలర్లను ఇక నుంచి నిలిపివేస్తున్నట్టు ట్రంప్ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మస్క్ (Elon Musk) నేతృత్వంలోని డోజ్ (DOGE) విభాగం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా స్పందించారు. ఈ మేరకు డోజ్ శాఖ నిర్ణయాన్ని సమర్థించారు.
ఫ్లోరిడాలోని తన నివాసమైన మార్ ఎ లాగోలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నిధుల నిలిపివేత గురించి ప్రశ్నించగా.. భారత్ వద్ద చాలా డబ్బులు ఉన్నాయని.. అలాంటప్పుడు ఇండియాకు 21 మిలియన్ డాలర్ల సాయం ఎందుకు చేయాలంటూ ప్రశ్నించారు. తనకు భారత ప్రజలు, ప్రధాని పట్ల ఎంతో గౌరవం ఉందని చెప్పారు. ‘భారత్‌కు 21 మిలియన్ డాలర్లు ఎందుకు ఇవ్వాలి..? వారివద్ద చాలా డబ్బు ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా పన్ను విధించే దేశాల్లో భారత్ ఒకటి. వారు విధించే సుంకాలు కూడా చాలా ఎక్కువ. సుంకాల విషయంలో అమెరికా ఎన్నడూ భారత్‌ను చేరుకోలేదు. కానీ, వారి ఓటర్ల సంఖ్యను పెంచేందుకు మాత్రం మనం 21 మిలియన్ డాలర్లు ఇవ్వాలా..? మరి మన దేశంలో ఓటర్ల పరిస్థితి ఏంటి..?’ అంటూ ట్రంప్ ప్రశ్నించారు.
#WATCH | US President Donald Trump says, “Why are we giving $21 million to India? They have a lot more money. They are one of the highest taxing countries in the world in terms of us; we can hardly get in there because their tariffs are so high. I have a lot of respect for India… pic.twitter.com/W26OEGEejT
— ANI (@ANI) February 18, 2025
ప్రభుత్వ వ్యవస్థలో సంస్కరణల కోసం టెస్లా బాస్ ఎలాన్ మస్క్ సారథ్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్)ను ట్రంప్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డోజ్ బాధ్యతలు చేపట్టిన మస్క్.. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో పన్ను చెల్లింపుదారులు (US taxpayers) కట్టే సొమ్మును వివిధ దేశాల కోసం ఖర్చు పెడుతున్నారని, వాటన్నింటినీ నిలిపివేస్తున్నట్లు ఇటీవల మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్‌లో ఓటింగ్ శాతం పెంచడానికి అందజేస్తోన్న 21 మిలియన్ డాలర్ల (రూ.187 కోట్లు)తో పాటు బంగ్లాదేశ్‌లో రాజకీయ స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి కేటాయించిన రూ.215 కోట్లుతోపాటు పాకిస్థాన్, నేపాల్ సహా పలుదేశాలకు కేటాయించిన సాయాన్ని డోజ్ శాఖ రద్దు చేసింది.
Also Read..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థమిదే.. ఒక్క గ్రాము ధర 53 వేల కోట్లు!
US Green Card | గ్రీన్‌కార్డుల కోసం దొంగ పెళ్లిళ్లు.. అమెరికా, కెనడాలో కొత్త తరహా మోసాలు
కోస్టారికాకు భారత అక్రమ వలసదారులు