ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థమిదే.. ఒక్క గ్రాము ధర 53 వేల కోట్లు!
ప్రపంచంలో అత్యంత ఖరీదైన పదార్థం ఏంటి ? అనే ప్రశ్న ఎదురైతే వజ్రం, బంగారం, ప్లాటినం ఇలా అనేక సమాధానాలు వస్తాయి. అయితే, వీటన్నింటి కంటే ఖరీదైన పదార్థం ఒకటి ఉంది. అదే ‘యాంటీమ్యాటర్'. మిగతా ఖరీదైన పదార్థాల్లా దీనిని భూమి నుంచి తవ్వి తీయడానికి కుదరదు.
న్యూయార్క్, ఫిబ్రవరి 18 : ప్రపంచంలో అత్యంత ఖరీదైన పదార్థం ఏంటి ? అనే ప్రశ్న ఎదురైతే వజ్రం, బంగారం, ప్లాటినం ఇలా అనేక సమాధానాలు వస్తాయి. అయితే, వీటన్నింటి కంటే ఖరీదైన పదార్థం ఒకటి ఉంది. అదే ‘యాంటీమ్యాటర్’. మిగతా ఖరీదైన పదార్థాల్లా దీనిని భూమి నుంచి తవ్వి తీయడానికి కుదరదు. ఒక్కో పరమాణువును కలుపుతూ దీనిని తయారుచేయాలి. ఇప్పుడు మనం చూస్తున్న విశ్వం ఆటమ్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు, సబ్ ఆటమిక్ కణాలతో కూడిన ‘మ్యాటర్’తో ఆవిర్భవించింది.
ప్రతి మ్యాటర్ కణాలకు ప్రతిబింబం లాంటి యాంటీమ్యాటర్ కణాలు ఉంటాయి. మ్యాటర్ కణాలకు పాజిటివ్ ఛార్జ్ ఉంటే, యాంటీమ్యాటర్ కణాలకు నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ యాంటీమ్యాటర్ తయారీ ఎంతటి క్లిష్టమైన ప్రక్రియ అంటే.. ఒక్క గ్రాములో పదో వంతు తయారుచేయడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. అందుకే, ఒక్క గ్రాము యాంటీమ్యాటర్ తయారు చేయడానికి రూ.53 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. 1999లో నాసా శాస్త్రవేత్త హరోల్డ్ గెర్రిష్ ఈ అంచనా వేశారు.
దీని తయారీకి కూడా అత్యాధునిక సాంకేతికత అవసరం. స్విట్జర్లాండ్‌లోని ఐరోపా అణు పరిశోధన సంస్థ సెర్న్ ఇప్పుడు యాంటీమ్యాటర్ తయారీకి ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం భారీ పార్టికల్ యాక్సెలరేటర్లను వినియోగిస్తున్నది. ఇంత భారీ మొత్తంలో వెచ్చించి తయారుచేసే యాంటీ మ్యాటర్‌ను ఎక్కడ వినియోగిస్తారనేది కూడా ఆసక్తికరమే. యాంటీ మ్యాటర్ అంతులేని శక్తిని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి అంతరిక్ష పరిశోధనలకు దీనిని ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. యాంటీమ్యాటర్‌ను భద్రపర్చడం అత్యంత కష్టం. ఇది మ్యాటర్‌తో కలిసినప్పుడు పేలుడు సంభవించి భారీగా శక్తి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి, మ్యాటర్‌తో కలవకుండా యాంటీమ్యాటర్‌ను భద్రపరచాలి. ఇది కేవలం ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ క్షేత్రాల్లో మాత్రమే సాధ్యమని భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలోని 23 లోకల్ బాడీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల..!
‘రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకే అగ్రి షో’
Gold Price | ఒకేరోజు రూ.1400 తగ్గిన బంగారం ధర.. 1.86 లక్షలకు దిగొచ్చిన వెండి..!
Alias Rukmini | టాలీవుడ్ హీరో నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ షూటింగ్ పూర్తి.. డిసెంబర్ 4న గ్రాండ్ రిలీజ్!
Aldas Janaiah | అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ అల్డాస్ జానయ్యపై విచారణకు గవర్నర్ ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

