Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పశ్చిమాసియా పర్యటన ముగింపుకు చేరుకుంది. అధ్యక్షుడు ట్రంప్ నిన్న ఖతార్ పర్యటనను ముగించుకొని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఘనంగా స్వాగతం పలికారు.
అబుదాబిలో ఓ ప్రత్యేకమైన సాంస్కృతిక ప్రదర్శన అల్-అయ్యాలాతో స్వాగతం పలికారు. అందులో మహిళలు తెల్ల దుస్తులను ధరించి తమ జుట్టును అటూ ఇటూ తిప్పుతూ (Hair Flipping Dance) ట్రంప్‌కు స్వాగతం పలికిన తీరు ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ట్రంప్ స్పెషల్ అసిస్టెంట్ మార్గో మార్టిన్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
The welcome ceremony in UAE continues! 🇺🇸🇦🇪 pic.twitter.com/sXqS1IboMN
— Margo Martin (@MargoMartin47) May 15, 2025
Also Read..
James Comey | అధ్యక్షుడు ట్రంప్‌ను చంపేస్తా.. ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ పోస్ట్ వైరల్
Ceasefire | ఈనెల 18 వరకే కాల్పుల విరమణ : పాక్ మంత్రి ఇషాక్ దార్
Donald Trump | భారత్‌లో యాపిల్ సంస్థను విస్తరించొద్దు.. టిమ్ కుక్కు సూచించిన ట్రంప్