గురువారం 04 జూన్ 2020
International - Apr 14, 2020 , 07:36:41

గ్రామ వీధుల్లో "దెయ్యాల" పెట్రోలింగ్‌..వీడియో

గ్రామ వీధుల్లో

ఇండోనేషియా: క‌రోనాను నియంత్రించేందుకు ప్ర‌పంచ‌దేశాల‌న్ని ఇపుడు లాక్ డౌన్, సామాజిక దూరాన్ని పాటిస్తున్న‌విష‌యం తెలిసిందే. అయితే కొన్ని దేశాల్లో మాత్రం జ‌నాల‌కు క‌రోనా భ‌యం లేన‌ట్లుంది. ఇళ్లలోనే ఉండి స్వీయ నిర్బంధాన్ని పాటించాల‌ని..ప్ర‌భుత్వాలు ఆదేశిస్తున్నా లెక్క చేయ‌కుండా ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వస్తున్నారు. జ‌నాలు ఇళ్లలోనే ఉండేలా ఇండోనేషియాలోని కెపుహ్ గ్రామంలో వినూత్న ఆలోచ‌న చేశారు.

వీధుల్లో అక్క‌డ‌క్క‌డా ఒక‌రిద్ద‌రు అచ్చు దెయ్యాల్లాగా వేషం వేసుకుని పెట్రోలింగ్ నిర్వ‌హిస్తున్నారు. ఇంకేముంది వీధుల్లోకి వ‌చ్చిన ఘోస్టుల‌ను చూసిన జ‌నాలు భ‌యంతో ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. పొకోంగ్ (ఇండోనేషియాలో ముసుగు దెయ్యం)తో భ‌య‌ప‌డ‌తారని భావించి..విభిన్నంగా ఏదైనా చేయాల‌ని ఆలోచించి ఇలాంటి ప్లాన్ చేశాం. పోలీసుల స‌మ‌న్వ‌యంతో లాక్ డౌన్, సోష‌ల్ డిస్టేన్స్ ను పాటించాల‌ని సూచిస్తున్నామని కెప్ హ్ గ్రామ అధ్య‌క్షుడు అంజ‌ర్ పంకానింగ్త్యాస్ తెలిపారు.

ఇండోనేషియాలో మాత్రం అధికారికంగా లాక్ డౌన్ విధంచ‌లేదు. దేశ‌వ్యాప్తంగా 4500 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా... 400 మంది చ‌నిపోయార‌ని జాన్ హాఫ్ కిన్స్ యూనివ‌ర్సిటీ తెలిపింది. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo