బీజింగ్: సొరంగంలో వరద నీరు నిండటం కారణంగా చైనాలో పెద్ద ప్రమాదం సంభవించింది. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని హైవే టన్నెల్లో వరద నీరు నిండి 13 మంది కార్మికులు మరణించారు. మరొకరు గల్లంతయ్యారు. గత రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. గత నాలుగు రోజులుగా చైనాలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టితో జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో ఆహార పదార్థాలకు కొరత ఏర్పడింది. ప్రపంచానికి ఐఫోన్లు అందించే సంస్థ ఉన్న హెనాన్ ప్రావిన్స్ గత నాలుగు రోజులుగా నీటిలోనే ఉండిపోయింది. దేశంలో నాలుగో వంతు పంటలు ఇక్కడే పండుతాయి. ఫ్రోజెన్ ఫుడ్ ప్రొడక్షన్ ఎక్కువగా ఇక్కడే జరుగుతుంది. బొగ్గు, ఇతర లోహాలు ఇక్కడి నుంచి చైనాలోని ఇతర ప్రాంతాలకు రవాణా అవుతాయి.
జుహై లి నగరంలో హైవే టన్నెల్‌లోని భారీగా వచ్చి చేరిన వరద నీటిలో చిక్కుకున్న 14 మందిలో 13 మంది మరణించారు. 10 మృతదేహాలను రెస్క్యూ టీం బుధవారం స్వాధీనం చేసుకున్నది. సొరంగంలో చిక్కుకున్న వ్యక్తి ఆచూకీ కోసం సిబ్బంది గాలిస్తున్నారు. రిజర్వాయర్ కింద ఉన్న షిజింగ్షాన్ సొరంగం అకస్మాత్తుగా నీటితో నిండిపోయింది. 14 మంది కార్మికులు కిలోమీటరు లోపల చిక్కుకుపోయారు. ఈ సొరంగం గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని జు హై లి లోని ప్రధాన ఎక్స్‌ప్రెస్‌వేలో భాగం. ఇది తీర నగరాన్ని వంతెనలతో పొరుగున ఉన్న మకావు, హాంకాంగ్‌ను కలుపుతుంది.
గత మార్చిలో ఈ సొరంగం గోడ కూలి ఇద్దరు కార్మికులు మరణించారు. ఇదే సమయంలో భారీ వర్షాలు చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో వరదలకు కారణమయ్యాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 33 మంది మరణించగా.. 12 మంది గల్లంతయ్యారు. దాదాపు 2 లక్షల మందిని సురక్షిత ప్రదేశాలకు ప్రభుత్వం తరలించింది. హెనాన్ ప్రావిన్స్‌లోని జెంగ్జౌ నగరంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 457.5 మిల్లీ మీటర్ల (18 అంగుళాలు) వర్షాపాతం నమోదైంది.
వరదలతో జెంగ్జౌ రైల్వే స్టేషన్లో 160 కి పైగా రైళ్లను నిలిపివేశారు. 260 విమానాలను ఇక్కడి విమానాశ్రయంలో రద్దు చేశారు. బస్సు సర్వీసులను ఎక్కడికక్కడ నిలిపివేయగా, సబ్వే సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.
న్యాయం కోసం ఎదురుచూస్తూ చనిపోయిన 108 ఏండ్ల వ్యక్తి
ఢిల్లీలో రైతు పార్లమెంట్.. షరతులతో అనుమతి
చరిత్రలో ఈరోజు.. మువ్వన్నెల జెండాకు ఆమోదం
రహస్య చట్టంలో మార్పులకు బ్రిటన్ సన్నాహాలు
రాజ్‌కుంద్రా ‘క్యూ’ చెప్పింది ఇక్కడే..?
ఇంట్లో ఫోన్ మర్చిపోయారా..? డోంట్‌వర్రీ కారు ఉందిగా..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..