Suicide Bomb Attack | పాక్‌లో ఆత్మాహుతి దాడి : ఐదుగురు చైనీయుల మృతి
Suicide Bomb Attack : పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు చైనా జాతీయులతో పాటు ఓ స్ధానికుడు మరణించారు.
Suicide Bomb Attack : పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు చైనా జాతీయులతో పాటు ఓ స్ధానికుడు మరణించారు. వారు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై దాడి జరిగిన క్రమంలో పేలుడు సంభవించింది. ఘటనా స్ధలానికి చేరుకున్న స్ధానిక పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు.
ఇస్లామాబాద్ నుంచి దాసులో తమ క్యాంప్‌నకు చైనా జాతీయుల కాన్వాయ్ వెళుతుండగా పేలుడు పదార్ధాలు నింపిన వాహనం వారి కాన్వాయ్‌ను ఢీ కొట్టగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ఐదుగురు చైనా జాతీయులతో పాటు వారి డ్రైవర్ (పాకిస్తాన్) ప్రాణాలు కోల్పోయారని పోలీస్ అధికారి వెల్లడించారు.
కాన్వాయ్‌లో ఇతర వ్యక్తులను క్షేమంగా బయటకు తీసుకువచ్చామని తెలిపారు. దాసు ప్రాంతంలో గతంలో కూడా చైనా జాతీయులు లక్ష్యంగా దాడులు జరిగాయి. 2021లో బస్‌పై జరిగిన పేలుడులో 9 మంది చైనా జాతీయులతో పాటు 13 మంది మరణించారు. ఇక 2023 ఆగస్ట్‌లో పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లో చైనా ఇంజనీర్ల కాన్వాయ్‌పై సాయుధ రెబెల్స్ దాడి చేపట్టారు.
Read More :
Vegans | మాంసాహారులతో పోలిస్తే వారిలో ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువ..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

