Vegans | మాంసాహారులతో పోలిస్తే వారిలో ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువ..
శుద్ధ శాకాహారులైనంత మాత్రాన ఆరోగ్యంగా ఉంటారనే రూలేముంది? ఆహారంలో సంతులత దెబ్బతింటే మొదటికే మోసం వస్తుందని వేగన్స్ను హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.
Vegans | శుద్ధ శాకాహారులైనంత మాత్రాన ఆరోగ్యంగా ఉంటారనే రూలేముంది? ఆహారంలో సంతులత దెబ్బతింటే మొదటికే మోసం వస్తుందని వేగన్స్ను హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. మాంసాహారులతో పోలిస్తే వేగన్స్లో ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. మాంసాహారాన్ని పూర్తిగా దూరం పెట్టడం, పాల ఉత్పత్తులను అసలే తీసుకోకపోవడం వల్ల వేగన్స్లో బాడీమాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) తగ్గుతున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంతేకాదు, వేగన్స్లో క్యాల్షియం పాళ్లు పడిపోవడం వల్ల కూడా ఎముకలు దెబ్బతినే ప్రమాదం అధికంగా ఉందంటున్నారు. మాంసాహారులతో పోలిస్తే వేగన్స్లో తుంటి ఎముక విరిగే ప్రమాదం రెండున్నర రెట్లు ఎక్కువగా ఉందట. చిన్నచిన్న దెబ్బలు తగిలినా కాలు ఎముక విరిగే రిస్క్ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి, వేగనిజానికి జై కొట్టినా.. శరీరంలో తలెత్తే మార్పులను ఎప్పటికప్పుడు గమనించుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Body Mass Index
- meat
- milk
- Vegans
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

