Fatwa | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు (Benjamin Netanyahu)పై ఇరాన్ (Iran)లో ఫత్వా (fatwa) జారీ అయ్యింది. ట్రంప్, నెతన్యాహులను శత్రువులుగా పేర్కొంటూ ఇరాన్ మత పెద్ద అయతుల్లా మకరెం షిరాజీ (Ayatollah Makarem Shirazi) ఈ మేరకు ఫత్వా జారీ చేశారు. వారిద్దరూ దేవుడి శత్రువులని (Enemies of God) పేర్కొన్నారు.
ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, ఇతర సీనియర్ మతాధికారులపై బెదిరింపులను తీవ్రంగా ఖండించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వాన్ని బెదిరిస్తున్న ఈ ఇద్దరు నేతలను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.‘ఇస్లామిక్ వ్యవస్థకు మూలస్తంభాలైన నాయకుల ప్రాణాలకు, ముఖ్యంగా సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) ప్రాణానికి ముప్పు తలపెట్టడం మతపరంగా నిషిద్ధం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు అలాంటి శత్రువులకు, వారి నేరాలకు వ్యతిరేకంగా దృఢంగా నిలబడాలి. వారి తప్పులకు పశ్చాత్తాప పడేలా చేయాలి’ అని మతపరమైన తీర్పులో పేర్కొన్నారు.
Also Read..
India-US | షరతులకు రెండు దేశాలూ ఓకే.. జులై 8 నాటికి భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ప్రకటన..!
Artificial Rain | ఢిల్లీలో కృత్రిమ వర్షానికి ఏర్పాట్లు.. ఎప్పుడు..? ఎందుకంటే..?
Char Dham Yatra | చార్ధామ్ యాత్రపై ఆంక్షలు ఎత్తివేత