Epstein Files | అమెరికాలో ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein) కేసు సంచలనం రేపుతోంది. తన పరపతి పెంచుకోవడం కోసం జెఫ్రీ ఏళ్ల తరబడి టీనేజ్ అమ్మాయిలను ఎరగా వేశాడు. ఆయన సన్నిహితుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సహా, మాజీ అధ్యక్షులు, రాజకీయ, వ్యాపార వేత్తలు కూడా ఉన్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా కీలక విషయం వెల్లడైంది.
ఎప్స్టీన్ ఫైళ్ల (Epstein Files)లో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) పేరు కూడా ఉంది. ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన ఫైళ్లను యూఎస్ ప్రభుత్వం తాజాగా విడుదల చేయగా మస్క్ పేరు బయటకు వచ్చింది. 2014 డిసెంబరు 6న ఎప్స్టీన్ ప్రైవేటు ద్వీపంలో మస్క్ పర్యటనను షెడ్యూల్ చేసినట్లు ఆ పత్రాలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లలో తన పేరు ఉండటాన్ని మస్క్ తీవ్రంగా ఖండించారు.
జెఫ్రీ ఎప్స్టీన్పై అమెరికాలో చైల్డ్ సెక్స్ ట్రాఫికింగ్ కేసు నమోదు అయ్యింది. సెక్స్ క్రైంలో దోషిగా తేలిన అతన్ని జైలులో వేశారు. అయితే మన్హట్టన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అతను 2019లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఎప్స్టీన్ కు సబంధించిన అన్ని అంశాలు బహిర్గతం చేయాలని ఇటీవల అమెరికా న్యాయ శాఖ ఆదేశాలు ఇవ్వడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది.
Also Read..
హమాస్ పని పట్టాల్సిందే.. ఐక్యరాజ్యసమితిలో నెతన్యాహు
Cow Brain | పాల దిగుబడికి ఆవు మెదడులో ఇంప్లాంట్.. రష్యాలో సంచలన ప్రయోగం
Black Holes | ఏటా 3,000 సూర్యుళ్లను మింగేస్తున్న కృష్ణబిలం!