Elon Musk | అమెరికాలోని టెక్ సంస్థల అధిపతులు, సీఈవోలకు (tech CEOs) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రత్యేకంగా విందు (trump hosts dinner) ఇచ్చిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం (White House)లో ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌తో కలిసి ట్రంప్ డిన్నర్ ఏర్పాటు చేశారు. దీనికి ప్రముఖ టెక్ సంస్థలకు చెందిన సీఈవోలు హాజరయ్యారు. అయితే, ఈ విందుకు ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) మాత్రం హాజరు కాలేదు. దీంతో ఆయన్ని ట్రంప్ ఆహ్వానించలేదంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ట్రంప్ డిన్నర్ పార్టీపై టెస్లా బాస్ తాజాగా స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. తనకు ఆహ్వానం అందిందని, కానీ వెళ్లలేకపోయినట్లు చెప్పారు. ‘ట్రంప్ విందుకు బిల్‌గేట్స్‌ను ఆహ్వానించారు. కానీ, ఎలాన్ మస్క్‌ను పిలవలేదు’ అంటూ ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఆ పోస్ట్‌కు స్పందించిన మస్క్.. ‘నాకు ఆహ్వానం అందింది. కానీ వెళ్లలేకపోయాను. నా తరఫున నా ప్రతినిధి వెళ్లారు’ అంటూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం మస్క్ స్పందన నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక ట్రంప్ ఏర్పాటు చేసిన డిన్నర్ పార్టీకి మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్, బ్లూ ఆరిజిన్ సీఈవో డేవిడ్ లింప్, ఒరాకల్ సీఈవో సఫ్రా కాట్జ్ తదితరులు హాజరయ్యారు. అయితే, ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) ఈ విందులో కనిపించకపోవడం చర్చనీయాంశమైంది.
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుపై మస్క్ తన వంతు పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఓ రకంగా చెప్పాలంటే మస్క్ కృషి వల్లే ఆయన ఈ ఎన్నికల్లో గెలిచారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మస్క్‌కు ట్రంప్ తన కేబినెట్లో కీలక డోజ్ శాఖ బాధ్యతలు అప్పగించారు. అయితే, ఆ తర్వాత ఓ బిల్లు విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో మిత్రులు కాస్తా శత్రువులుగా మారారు. బహిరంగంగానే పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఆ తర్వాత డోజ్ శాఖ బాధ్యతల నుంచి మస్క్ తప్పుకున్నారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ ఎక్కడా కలిసి కనిపించలేదు. టెస్లా బాస్‌ను ట్రంప్ పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇప్పుడు వైట్‌హౌస్ విందుకు మస్క్‌ను ఆహ్వానించకుండా ఆయన ప్రత్యర్థి అయిన ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌ను ట్రంప్ ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. దీనిపై మస్క్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
Also Read..
Donald Trump | టెక్ సీఈవోలకు ట్రంప్ ప్రత్యేక విందు.. మస్క్‌కు అందని ఆహ్వానం
Tim Cook | అమెరికాలో ఎంత పెట్టుబడి పెడతారు..? యాపిల్ సీఈవోకు ట్రంప్ సూటి ప్రశ్న
Donald Trump | రక్షణశాఖ కాదు.. ఇకపై డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ : ట్రంప్