Earthquake | పనామా (Panama) – కొలంబియా (Colombia) సరిహద్దుకు సమీపంలో ఉన్న కరేబియన్ సముద్రం (Caribbean Sea )లో బుధవారం రాత్రి భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.6గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (US Geological Survey) తెలిపింది.
పనామాలోని ప్యూర్టో ఒబల్డా (Puerto Obaldia)కు ఈశాన్యంగా 41 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైందని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) తెలిపింది. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల (6 మైళ్ళు) లోతులో గుర్తించినట్లు పేర్కొంది. 6.6 తీవ్రతతో భూమి కంపించిన 10 నిమిషాల తర్వాత అదే ప్రాంతంలో 4.9 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఆ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు ఏమీ జారీ కాలేదు. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు పనామా సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ సినాప్రోక్ తెలిపింది.
Also Read..
Adah Sharma | కేరళ స్టోరీ నటికి షాక్.. నెట్టింట ఫోన్‌నంబర్ లీక్
Arvind Kejriwal | నేడు శరద్ పవార్‌తో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భేటీ
Naveen Patnaik | పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతున్నాం.. ప్రకటించిన ఒడిశా సీం నవీన్ పట్నాయక్