Donald Trump | ఇరాన్లో అధికార మార్పిడి (regime change in Iran)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో పాలనాపరమైన మార్పు జరగాలన్నట్టు ఇటీవలే సంకేతాలు ఇచ్చిన ట్రంప్ తాజాగా మాట మార్చారు. ఇరాన్లో పాలన మార్పు తాము కోరుకోవడం లేదని వ్యాఖ్యానించారు. అయితే, గత వారం ‘ఇరాన్లో అధికార మార్పిడి ఎందుకు జరగకూడదు..?’ అంటూ ట్రంప్ ట్రూత్‌లో రాసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పోస్ట్‌కు విరుద్ధంగా అధికార మార్పిడి కోరుకోవట్లేదు అని అనడం ఆసక్తికరంగా మారింది.
నెదర్లాండ్స్‌లో జరగనున్న నాటో సదస్సుకు బయల్దేరిన ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ‘ఇరాన్లో నాయకత్వ మార్పు అవసరమా..?’ అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. ‘ఇరాన్లో నాయకత్వ మార్పును కోరుకోవడం లేదు. పాలన మార్పు గందరగోళానికి దారి తీస్తుంది. అన్ని సమస్యలూ త్వరలోనే తొలగిపోతాయి’ అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read..
Shubhanshu Shukla | రోదసి యాత్రకు రెఢీ.. డ్రాగన్ అంతరిక్ష నౌకలోకి వ్యోమగాములు
Qatar | సయోధ్యకు కేరాఫ్ ఖతార్.. మధ్యవర్తిత్వంలో పెద్దన్న