Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు తీవ్ర నిరాశ ఎదురైన విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) ఈ ఏడాది ఆయనకు దక్కలేదు. ఈ బహుమతి కోసం ట్రంప్ తహతహలాడిన విషయం తెలిసిందే. శాంతి బహుమతి దక్కని వేళ.. ట్రంప్‌ను తాజాగా ఓ అత్యున్నత పౌర పురస్కారం వరించింది.
గాజాలో శాంతి ఒప్పందం కుదిర్చినందుకు గానూ ట్రంప్‌కు తన దేశ అత్యున్నత పౌర పురస్కారమైన (Israels Highest Civilian Award) ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ (Presidential Medal of Honor)ను ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇస్సాక్ హెర్జోగ్ తాజాగా వెల్లడించారు. రానున్న నెలల్లో సమయం, వేదిక నిర్ణయించి అందజేయనున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌కు ట్రంప్ ఇచ్చిన మద్దతు, దేశ పౌరుల భద్రత, శ్రేయస్సు కోసం నెలకొల్పిన శాంతికి గుర్తుగా ఆయన్ని ఈవిధంగా తాము గౌరవిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ అవార్డు ఇజ్రాయెల్ గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కూడా అందజేసిన విషయం తెలిసిందే. 2013లో ఒబామా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
Also Read..
Donald Trump: ఇజ్రాయిల్ పార్లమెంట్లో ప్రసంగించనున్న ట్రంప్
Israeli Hostages | రెండేండ్ల తర్వాత ఇజ్రాయెల్ బందీలకు విముక్తి.. ఏడుగురిని విడుదల చేసిన హమాస్
Donald Trump | నేను యుద్ధాలు ఆపడంలో నిపుణుడిని.. ఇక పాక్-ఆఫ్ఘాన్ వార్ సంగతి చూస్తా : ట్రంప్