Israeli Hostages | గాజాలో గత రెండేండ్లుగా సాగుతున్న యుద్ధం ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas War) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire) కుదిరిన విషయం తెలిసిందే. తొలి దశ శాంతి ఒప్పందంలో భాగంగా బందీల విడుదల ప్రారంభమైంది. దాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి సోమవారం విముక్తి లభించింది (Israeli Hostages).
ఏడుగురు ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేసింది. వారిని రెడ్‌క్రాస్ (Red Cross)కు అప్పగించింది. దీంతో ఖాన్ యూనస్ నుంచి వారిని ఇజ్రాయెల్ తీసుకెళ్లింది. హమాస్ చెర నుంచి విడుదలైన ఏడుగురు బందీలను గాలి, జివ్ బెర్మాన్, మతన్ అంగ్రెస్ట్, అలాన్ ఓహెల్, ఒమ్రి మిరాన్, ఈతాన్ మోర్, గై గిల్బోవా డల్లాల్గా స్థానిక మీడియా పేర్కొంది. మిగతా బందాలను మరికాసేపట్లో విడుదల చేయనుంది. మరోవైపు ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ (Israel) కూడా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది.
రెండేళ్ల క్రితం ఇజ్రాయెల్‌పై హమాస్ అనూహ్య దాడితో యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడికి దిగింది. దాదాపు 1,200 మందిని హతమార్చి, 250 మందికిపైగా బందీలుగా చేసుకుంది. హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో 67,000 మందికిపైగా పాలస్తీనా పౌరులు మరణించారు. ఇజ్రాయెల్ దాడుల్లో వేలాది ఇళ్లు నేలమట్టం కాగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులై టెంట్లలో తలదాచుకుని జీవిస్తున్నారు. వేలాదిమంది ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధం ముగింపుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకొచ్చారు. ఈ మేరకు గాజాలో శాంతికి 20 సూత్రాల శాంతి ప్రణాళికను సూచించారు. ఇందుకు ఇజ్రాయెల్-హమాస్ అంగీకరించడంతో యుద్ధం ముగింపుకు తొలి అడుగు పడింది. శుక్రవారం నుంచే ఈ ఒప్పందం అమల్లోకి రాగా.. బందీల విడుదల నేడు ప్రారంభమైంది.
Also Read..
Donald Trump | నేను యుద్ధాలు ఆపడంలో నిపుణుడిని.. ఇక పాక్-ఆఫ్ఘాన్ వార్ సంగతి చూస్తా : ట్రంప్
Donald Trump | ఇజ్రాయెల్‌కు బయల్దేరి వెళ్లిన ట్రంప్.. గాజాలో యుద్ధం ముగిసిందంటూ ప్రకటన
శాంతి శాశ్వతమయ్యేనా?.. బందీల విడుదలపై సర్వత్రా ఎదురుచూపులు