Donald Trump | తన ప్రత్యర్థి కమలా హారిస్ (Kamala Harris)తో మరో డిబేట్‌కు సిద్ధంగా లేనని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. తొలి డిబేట్లో ఓడిపోయిన వాళ్లే మళ్లీ చర్చకు సిద్ధమవుతారని కమలా హారిస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. తాను మూడో చర్చకు సిద్ధంగా లేను అంటూ అందులో రాసుకొచ్చారు.
కాగా, అధ్యక్ష రేసులోంచి జో బైడెన్ వైదొలగకముందు ట్రంప్, బైడెన్ల మధ్య తొలి డిబేట్ జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అనూహ్యంగా ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా రేసులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ – కమలా మధ్య తొలి డిబేట్ జరిగింది. పెన్సిల్వేనియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ వేదికగా జరిగిన మొదటి ముఖాముఖిలో ఇద్దరూ పాల్గొన్నారు. వాడీవేడిగా సాగిన ఈ డిబేట్లో పరస్పర విమర్శల దాడి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఈ ముఖాముఖి చర్చలో కమలా హారిస్‌దే పైచేయి అని అమెరికా మీడియా మొత్తం తేల్చింది. అయితే, అందుకు ట్రంప్ అంగీకరించట్లేదు.
కాగా, నవంబర్ 5న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమాక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ పడుతున్నారు. గెలుపే లక్ష్యంగా ఇద్దరు అభ్యర్థులూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇక భారత మూలాలున్న అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ (Kamala Harris) ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు గట్టి పోటీ ఇస్తున్నారు.
ఈ క్రమంలో ఇద్దరు అధ్యక్ష అభ్యర్థుల మధ్య ఇవాళ తొలి డిబేట్ జరిగింది. ఏబీసీ న్యూస్ నిర్వహించిన చర్చలో పాల్గొన్నారు. ఆ ఇద్దరూ అనేక అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అబార్షన్లు, యుద్ధాలు, ఆర్థికం, హౌజింగ్ సంక్షోభం లాంటి అంశాలపై చర్చించుకున్నారు. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్.. పోటాపోటీగా డిబేట్లో పాల్గొన్నారు. తొలుత ఇద్దరూ చర్చావేదికపై హ్యాండ్‌షేక్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత తమ విధానాలను వివరించారు.
Also Read..
Harish Rao | హరీశ్‌రావు హౌస్ అరెస్ట్.. కోకాపేటలో భారీగా మోహరించిన పోలీసులు
BRS | కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం
Afghanistan Vs New Zealand: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్.. ఏకైక టెస్టు వర్షార్పణం