Donald Trump : అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వైట్‌హౌస్ (White house) ప్రెస్ సక్రెటరీ (press secretory) కరోలిన్ లీవిట్ (Karoline Leavitt) ను పొగడ్తల్లో ముంచెత్తారు. న్యూస్మాక్స్లో రాబ్ ఫిన్నెర్టీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికాకు అధ్యక్షుడిగా సేవలు అందించిన అందరిలో తనకు మాత్రమే అద్భుతమైన, ఉత్తమ ప్రెస్ సెక్రెటరీ ఉందని అన్నారు.
కరోలిన్ లీవిట్ మెషీన్ గన్లా తన విధులను సమర్థమంతంగా నిర్వర్తిస్తోందని ట్రంప్ ప్రశంసించారు. ఆమె తన అందం, హుందాతనంతో ప్రజల్లో ఓ స్టార్‌గా మారిపోయిందని వ్యాఖ్యానించారు. కరోలిన్ మాట్లాడేటప్పుడు ఆమె పెదాల కదలిక చాలా అందంగా ఉంటుందని పొగిడారు. అందమైన ముఖం, అందమైన పెదాల కదలిక, చురుకైన బ్రెయిన్ ఆమెను ఒక మెషీన్ గన్లా మార్చాయని ప్రశంసించారు.
అదే ఇంటర్వ్యూలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. 2016 ఎన్నికల్లో తాను విజయం సాధించిన తర్వాత తన పాలనను నియంత్రించేందుకు ఒబామా సన్నిహిత వర్గాలు అసత్య ప్రచారం చేశాయని ఆరోపించారు. ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందంటూ తప్పుడు వాదన తెచ్చారని విమర్శించారు. అందుకు ఒబామా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.