Viral news : బైకులో పెట్రోల్ పోసుకునేందుకు ఓ బైకుపై ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ పంపు (Petrol pump) కు వచ్చారు. అయితే వారిదగ్గర హెల్మెట్ (Helmet) లేకపోవడంతో ఆ బైకులో పెట్రోల్ పోసేందుకు సిబ్బంది నిరాకరించారు. దాంతో ఆ ముగ్గురిలో ఒకడు అగ్గిపుల్ల (Match stick) గీసి పెట్రోల్ ట్యాంక్ వైపు విసిరాడు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని ఇండోర్ సిటీ (Indore city) లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
పెట్రోల్ పంపు సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెట్రోల్ పంపులోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. హెల్మెట్ లేకుండా బైకుపై వచ్చిన ముగ్గురికి పెట్రోల్ పోసేందుకు పంపు సిబ్బంది నిరాకరించారని, దాంతో ఆ ముగ్గురు పెట్రోల్ పంపు సిబ్బందితో గొడవపెట్టుకున్నారని’ పోలీసులు తెలిపారు.
గొడవ తర్వాత తిరిగివెళ్తూ బైకుపై వచ్చిన ముగ్గురిలో ఒకడు అగ్గిపుల్ల గీసి ట్యాంకుపైకి విసిరాడని, ఇది గమనించిన సిబ్బంది ఫిర్యాదు చేయడంతో తాము కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. అయితే ఈ ఘటనలో పెట్రోల్ పంపుకు ఎలాంటి డ్యామేజ్ జరగలేదని తెలిపారు. కాగా నిందితుడు పెట్రోల్ పంపుపైకి అగ్గిపుల్ల విసిరిన దృశ్యాన్ని కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Indore | CCTV footage of bikers who threw a matchstick on a petrol pump after not getting petrol for being without helmet
(Source: Indore Police) https://t.co/Cu8S3Q7Qdg pic.twitter.com/PIqiGISroZ
— ANI (@ANI) August 2, 2025