Donald Trump : ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే రెండు దేశాలు చేసిన ప్రకటనలు మళ్లీ ఉద్రిక్తతలకు తెరలేపాయి. ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని, అందుకు ప్రతిగా తాము గట్టిగా బుద్ధిచెబుతామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. దాంతో ఇజ్రాయెల్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్‌పైనే ఉన్నాయని ఇరాన్ కౌంటర్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ ద్వారా స్పందించారు. ఇజ్రాయెల్ గట్టి హెచ్చరిక చేశారు. ‘ఇజ్రాయెల్. ఆ బాంబులను జారవిడువకండి. అది అతిపెద్ద ఉల్లంఘన అవుతుంది. మీ పైలెట్లను వెంటనే వెనక్కి తెచ్చుకోండి.’ అని తన పోస్టులో పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ట్రంప్ ప్రతిపాదన మేరకు ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.
కాల్పుల విరమణకు ఒప్పుకుంటున్నట్లు రెండు దేశాలు అధికారిక ప్రకటనలు కూడా చేశాయి. ఆ తర్వాత రెండు గంటలకే ఇరాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, అందుకు తాము గట్టిగా బుద్ధిచెబుతామని ఇజ్రాయెల్ వ్యాఖ్యానించింది. అయితే ఇజ్రాయెల్ ఆరోపణలను ఇరాన్ తిప్పికొట్టింది. ఇజ్రాయెల్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్‌పైనే ఉన్నాయని, ప్రతిదాడికి సిద్ధంగా ఉన్నామని వార్నింగ్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ట్రంప్ ట్రూత్ సోషల్ ద్వారా స్పందించారు. ఇజ్రాయెల్ తొందరపడి బాంబులు వేయవద్దని హెచ్చరించారు. అయితే ట్రంప్ మాటపై ఇజ్రాయెల్ నిలబడుతుందా.. లేదంటే ఇరాన్‌పై బాంబులు వేసి మళ్లీ యుద్ధాన్ని రాజేస్తుందా అనేది వేచిచూడాలి.