Netanyahu : ఇజ్రాయెల్-ఇరాన్ (Israel vs Iran) యుద్ధం చల్లారినట్లే కనిపిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరుదేశాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెహ్రాన్ కాల్పుల విరమణను మొదలుపెట్టగా.. సీజ్‌ఫైర్‌ను తామూ అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ ప్రధానమంత్రి బెంజామిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది.
ఇరాన్ దేశం నుంచి అణుముప్పు తొలగిపోయిందని నెతన్యాహు తన ప్రకటనలో పేర్కొన్నారు. అందుకు సహకరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు నెతన్యాహు కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా గత కొన్ని రోజులుగా దాడులు, ప్రతిదాడులకు పాల్పడ్డ ఇరాన్-ఇజ్రాయెల్ దేశాలు ఇవాళ కాల్పుల విరమణకు అంగీకరించాయి.