Donald Trump | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌పై మరోసారి నోరుపారేసుకున్నారు. కమలా హ్యారిస్ ఓ ఫ్రాడ్ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఎక్స్‌లో పోస్ట్ చేసిన ర్యాలీకి సంబంధించిన ఫొటోల్లో కమలా హారిస్ కృత్రిమ మేథస్సు (AI)ని ఉపయోగించి జనం ఎక్కువగా ఉన్నట్లు చూపించారని ట్రంప్ ఆరోపించారు. మిచిగాన్ డెట్రాయిల్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ వద్దకు మాకు ఘన స్వాగతం లభించింది. ఎయిర్పోర్ట్ వద్ద చూపించిన జనాలకు సంబంధించిన ఫొటోలు నకిలీవని ఆరోపించారు. విమానాశ్రయం వద్ద ఎవరూ లేరని.. ఏఐ టెక్నాలజీని వాడి భారీగా జనం ఉన్నట్లుగా చూపించారని.. కమలా హ్యారిస్ కోసం ఎయిర్పోర్ట్ వద్ద ఎవరూ ఎదురుచూడలేదన్నారు. ప్రజాస్వామ్యవాదులు ఇలా మోసం చేసి ఎన్నికల్లో గెలుస్తారని విమర్శించారు.
ఈ విమర్శలపై కమలా హ్యారిస్, టీమ్ వాల్జ్ స్పందించారు. ర్యాలీకి సంబంధించిన పోస్ట్ చేస్తూ 15వేల మంది తరలివచ్చినట్లుగా పేర్కొన్నారు. ట్రంప్ ఎనర్జీ తగ్గుతోందని.. అందుకే స్వింగ్ స్టేట్‌లో వారం రోజులుగా ప్రచారం చేయడం లేదన్నారు. ఓ వీడియో పోస్ట్ చేస్తూ.. ఈ వీడియోలోని కంటెంట్ ట్రంప్‌ను కలవరపెడుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. గత నెలలో జోబైడెన్ వచ్చే ఏడాది జరుగనున్న అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నారు. దాంతో భారత సంతతికి చెందిన వైస్ ప్రెసిడెంట్ హారిస్‌ను అధికార డెమోక్రటిక్ పార్టీ 2024 అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారు. చాలా ఆమెకు మద్దతు ప్రకటించారు. అమెరికాలోని ఒక ప్రధాన రాజకీయ పార్టీ నుంచి అధ్యక్ష పదవి బరిలో నిలిచిన తొలి ఇండో-ఆఫ్రికన్ మహిళగా కమలా హారిస్ నిలిచారు. ఆమె రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల నుంచి అధ్యక్ష అభ్యర్థిగా నిలిచిన తొలి భారతీయ-అమెరికన్‌గా ఘనత సాధించారు. కమలా హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్ భారతీయురాలు కాగా.. ఆమె తండ్రి డోనాల్డ్ జాస్పర్ హారిస్ జమైకాకు చెందిన వ్యక్తి. కమలా హారిస్ తల్లిదండ్రులు వలసదారులుగా అమెరికాకు వచ్చారు.
Pregnancy Status: మగవాళ్లైనా ఇక నుంచి ప్రెగ్నెన్సీ స్టేటస్ చెప్పాల్సిందే
Bangladesh | హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పిన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం