లండన్: బ్రిటన్ ఆరోగ్య శాఖ అధికారులు కొత్త ఆదేశాలు జారీ చేశారు. ఎక్స్-రే, సీటీ, ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకునే మగ పేషంట్లకు చెందిన ప్రెగ్నెంట్ స్టేటస్(Pregnancy Status) తెలుసుకోవాలని ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇటీవల ఓ ట్రాన్స్‌జెండర్ వ్యక్తి సీటీ స్కాన్ చేయించుకున్నాడు. అయితే అతను ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో ఆ స్కానింగ్ జరిగింది. ఎక్స్‌రే, సీటీ, ఎంఆర్ఐల వల్ల.. పుట్టబోయే బిడ్డలకు ప్రమాదం ఉంటుందని, అందుకే స్కానింగ్‌కు ముందు.. మగవాళ్లైనా వాళ్ల ప్రెగ్నెన్సీ స్టేటస్ తెలుసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులు తమ ఆదేశాల్లో తెలిపారు. 12 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న మగవారిని ఆ ప్రశ్నలు వేయాలని అధికారులు సూచించారు. పురుషులైనా, ట్రాన్స్జెండరైనా, ఇంటర్‌సెక్స్ పేషెంట్లు ఎవరు ఉన్నా.. వారి ప్రెగ్నెన్సీ స్టేటస్ తెలుసుకోవాలన్నారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం .. స్కానింగ్ ఎవరు చేయించుకున్నా.. వాళ్లు జెండర్‌తో పాటు ఫెర్టిలిటీ స్టేటస్ చెప్పాల్సి ఉంటుంది. బ్రిటీష్ అధికారులు తీసుకున్న నిర్ణయం పట్ల కొందరు డాక్టర్లు, పేషంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఎంక్వైరీ ఫారమ్‌లను ఇప్పటికే లండన్‌లోని పలు ఆస్పత్రలు వాడడం మొదలుపెట్టనట్లు తెలుస్తోంది.