Bangladesh | హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పిన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం
Bangladesh | షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వంపై తిరుగుబాటు రాజీనామా అనంతరం బంగ్లాదేశ్‌లో అస్థిరత, అశాంతి నెలకొన్నది. చాలా ప్రాంతాల్లో హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేవాలయాలపై సైతం అల్లరిమూకలు దాడులకు తెగబడుతూ దోచుకుంటున్నాయి.
Bangladesh | షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వంపై తిరుగుబాటు రాజీనామా అనంతరం బంగ్లాదేశ్‌లో అస్థిరత, అశాంతి నెలకొన్నది. చాలా ప్రాంతాల్లో హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేవాలయాలపై సైతం అల్లరిమూకలు దాడులకు తెగబడుతూ దోచుకుంటున్నాయి. ఈ క్రమంలో దాడులకు వ్యతిరేకంగా ఆదివారం వేలాది మంది నిరసనకారులు ఢాకా వీధుల్లోకి వచ్చి మైనారిటీలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా.. భద్రత కల్పించడంలో విఫలమైనందుకు హిందూ సమాజానకి తాత్కాలిక ప్రభుత్వంలోని హోం వ్యవహారాల సలహాదారు బ్రిగేడియర్ జనరల్ (రిటైర్డ్) ఎం సఖావత్ హుస్సేన్ క్షమాపణలు చెప్పారు.
మైనారిటీలను రక్షించడం మెజారిటీ సమాజానికి అత్యంత కర్తవ్యమని తాము ఆదేశాలు ఇచ్చామన్నారు. అలా చేయకుండా మసీదులో నమాజ్ చేయడంలో బిజీగా ఉంటే.. వారు ఎందుకు విఫలమయ్యారో సమాధానం చెప్పాల్సి ఉంటుందని హుస్సేన్ స్పష్టం చేశారు. భద్రత కల్పించేందుకు, మైనారిటీలను రక్షించడం మా మతంలో భాగమన్నారు. మైనారిటీలను క్షమాపణలు కోరుతున్నానన్నారు. దేశమంతా అశాంతిలో ఉందని.. పోలీసులు సైతం మంచి స్థితిలో లేరన్నారు. కాబట్టి వారిని రక్షించాలని తాను సమాజాన్ని కోరుతున్నానన్నారు. మైనారిటీ సొంత సోదరులవంటివారేనని.. మేమంతా కలిసే పెరిగామన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

