గురువారం 04 జూన్ 2020
International - Apr 22, 2020 , 11:23:38

లక్ష క‌రోనా కేసులు దాటిన దేశాలివే..!

 లక్ష క‌రోనా కేసులు దాటిన దేశాలివే..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా మ‌హ‌మ్మారి అంత‌కంత‌కూ పెరిగిపోతుంది.అన్ని దేశాల్లో వైర‌స్ వ్యాప్తి వేగంగా విస్త‌రిస్తోంది. చాలా దేశాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నప్పటికీ.. కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ప్ర‌పంచంలోని 210 దేశాలకు ఈ వైరస్‌ విస్తరించగా.. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 25,57,837కు చేరింది. వీరిలో 1,77,674 మంది మృత్యువాతపడగా.. 695,262 మంది కోలుకున్నారు. ల‌క్ష‌కు పైగా పాజిటివ్ కేసులున్న దేశాల‌ను చూస్తే  అమెరికాలో 8,19,606పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 45,368 మంది ప్రాణాలు కోల్పోగా... 82,973 మంది కోలుకున్నారు.

అమెరికా తరువాత స్పెయిన్ 2,04,178 కేసులుండా 21,282 మ‌ర‌ణాలు 82,514 మంది కోలుకున్నారు. ఇటలీ 183,957 పాజిటివ్ ఉండగా 24,648 మ‌ర‌ణించారు. 51,600 కోలుకున్నారు. ఫ్రాన్స్ 1,58,050 కేసులు,24,648 మ‌ర‌ణాలు ఉండ‌గా 51,600 మంది రిక‌వ‌రీ అయ్యారు. జ‌ర్మ‌నీ 1,48,,453 కేసులు, 5,086 మ‌ర‌ణాలు, బ్రిట‌న్ 1,29,044, మ‌ర‌ణాలు 17,337 ఉన్నాయి. ఇక 50వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల జాబితాలో టర్కీ, ఇరాన్‌, చైనా దేశాలు ఉండగా.. తాజాగా రష్యా కూడా చేరింది. ఇక వైరస్‌ పుట్టిన చైనాలో మొన్నటివరకు తగ్గినట్లే కనిపించిన కరోనా.. ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. ఆ దేశంలో ప్రస్తుతం 82,810కేసులు ఉన్నాయి. 


logo