డమాస్కస్: శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో బాంబు పేలింది. ఈ సంఘటనలో 8 మంది మరణించారు. మరో18 మంది గాయపడ్డారు. ఈ బాంబు పేలుడుకు ఉగ్రవాదులు కారణమని ఆ దేశ మంత్రి ఆరోపించారు. (blast at Syria mosque) సిరియాలోని హోమ్స్ నగరంలో ఈ సంఘటన జరిగింది. మైనారిటీ కమ్యూనిటీ ప్రాంతమైన అలవైట్లోని వాడి అల్-దహాబ్ పరిసరాల్లోని మసీదులో బాంబు పేలింది. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఇమామ్ అలీ బిన్ అబి తాలిబ్ మసీదు లోపల ఈ పేలుడు సంభవించినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. ఈ బాంబు దాడిలో 8 మంది మరణించగా 18 మంది గాయపడినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
కాగా, సిరియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఈ బాంబు పేలుడును ధృవీకరించింది. ఉగ్రవాద దాడిగా పేర్కొంది. శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా ఉగ్రవాదులు మసీదును లక్ష్యంగా చేసుకున్నట్లు మీడియాకు వెల్లడించింది.
Also Read:
Japan: రబ్బర్ ఫ్యాక్టరీలో కత్తితో దాడి.. 14 మందికి గాయాలు
California | క్రిస్మస్ వేళ.. కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు.. VIDEOS
Bus Accident | 600 అడుగుల లోతులో పడిపోయిన బస్సు.. 10 మంది మృతి.. క్రిస్మస్ వేళ విషాదం