Bus Accident | క్రిస్మస్ వేళ మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెరక్రూజ్ రాష్ట్రంలోని జొంటోకొమట్లాన్ పట్టణంలో బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 32 మంది గాయపడ్డారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు స్వగ్రామాలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మలుపులతో కూడిన ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న బస్సు నియంత్రణ కోల్పోవడంతో 600 అడుగులకు పైగా లోతులో లోయలో పడింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు, అగ్నిమాపక దళాలు, పోలీసులు అక్కడకు చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. లోయలో పడిపోయిన బస్సు నుంచి ప్రయాణికులను బయటకు తీసేందుకు భారీగా శ్రమిస్తున్నారు.