టోక్యో: జపాన్(Japan)లో ఓ వ్యక్తి కత్తితో జరిపిన దాడిలో 14 మంది గాయపడ్డారు. మిషిమాలో ఉన్న యోకోహోమా రబ్బర్ ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. కత్తి పోట్లతో పాటు ఆ వ్యక్తి గుర్తు తెలియని ద్రవాన్ని చల్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. టోక్యోకు పశ్చిమ దిశలో ఉన్న షిజుకా ప్రావిన్సులో మిషిమా నగరం ఉన్నది.
కత్తితో దాడి చేసిన వ్యక్తిని ఫ్యాక్టరీలోనే పట్టుకున్నట్లు క్యోడో న్యూస్ ఏజెన్సీ పేర్కొన్నది. అయితే ఈ ఘటనకు చెందిన వివరాలు ఎక్కువగా రాలేదు. గాయపడ్డవారి పరిస్థితి ఎలా ఉందో ఇంకా తెలియదు. ఫ్యాక్టరీలో దాడి ఘటన జరిగినట్లు తమకు సాయంత్రం 4.30 నిమిషాలకు సమాచారం వచ్చినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
యోకోహోమా రబ్బర్ కంపెనీలో ట్రక్కులు, బస్సులకు చెందిన టైర్లు ఉత్పత్తి చేస్తారు.