Cyclone Mocha | ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మోచ తుఫాన్ (Cyclone Mocha) బంగ్లాదేశ్ (Bangladesh ), మయన్మార్ (Myanmar) దేశాలను వణికిస్తోంది. ఈ తుఫాను ఆదివారం మధ్యాహ్నం రెండు దేశాల మధ్య తీరం దాటింది. దీంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీరం దాటిన సమయంలో గంటలకు 210 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. సముద్రంలో 8-12 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగసి పడ్డాయి. భారీ గాలులతో బంగ్లాదేశ్, మయన్మార్ తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. భారీ వర్షాలకు రెండు దేశాలు అల్లాడిపోతున్నాయి. రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తుఫాను కారణంగా మయన్మార్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Cyclone Mocha 2
ఈదురు గాలులకు చెట్లు కూలి ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విత్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండు దేశాల్లో కలిపి సుమారు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు పశ్చిమ బెంగాల్‌కు తుఫాను ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఆ రాష్ట్రం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.
Cyclone Mocha 3
మరోవైపు భారీ వర్షాలు, ఈదురు గాలుల ప్రభావంతో తీరప్రాంతాల సమీపంలోని విమానాశ్రయాలను అధికారులు మూసివేశారు. బంగ్లాదేశ్‌లో ప్రజల కోసం 1,500 తాత్కాలిక ఆశ్రయాలను ఏర్పాటు చేశారు. దాదాపు రెండు దశాబ్దాల్లో బంగ్లాదేశ్ ఎదుర్కొంటున్న అత్యంత శక్తిమంతమైన తుఫాను ఇదేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతకుముందు.. 2007లో వచ్చిన తుఫాను ధాటికి బంగ్లాదేశ్‌లో సుమారు 3 వేల మందికిపైగా మృతి చెందారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.
Cyclone Mocha 4
Cyclone Mocha 5
Storm surges whipped up by a powerful cyclone moving inland from the Bay of Bengal inundated the Myanmar port city of Sittwe https://t.co/YG8TOBMG0X pic.twitter.com/li37p4HiRa
— Reuters (@Reuters) May 14, 2023
SCS “Mocha” over Myanmar weakened into a Cyclonic Storm at 0230 hours IST of 15th May over Myanmar near latitude 23.5°N and longitude 95.3°E about 450 km NNE of Sittwe (Myanmar), 260 km of north-northeast of Nyaung-U (Myanmar) and 420 km ENE of Cox’s Bazar (Bangladesh). pic.twitter.com/6d160C8sG4
— India Meteorological Department (@Indiametdept) May 15, 2023
Also Read..
Sharad Pawar | ఇతర రాష్ట్రాల్లోనూ కర్ణాటక వ్యూహాలను అనుసరించాలి : శరద్ పవార్
Siddaramaiah | తదుపరి సీఎంపై ఉత్కంఠ.. ఎమ్మెల్యేలతో సిద్ధరామయ్య రహస్య సమావేశాలు..?
Terror funding case | ఉగ్రవాదులకు నిధుల కేసులో పుల్వామా, షోపియాన్ జిల్లా ఎన్ఐఏ సోదాలు