Terror funding case | ఉగ్రవాదులకు నిధుల కేసులో పుల్వామా, షోపియాన్ జిల్లా ఎన్ఐఏ సోదాలు
జమ్ముకశ్మీర్‌లోని (Jammu and Kashmir) పలు జిల్లాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దాడులు నిర్వహిస్తున్నది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న కేసులో దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా (Pulwama), షోపియాన్ (Shopian) జిల్లాల్లో ఉగ్రవాదులతో సంబంధాలున్న వారి ఇండ్లలో సోదాలు చేస్తున్నది.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని (Jammu and Kashmir) పలు జిల్లాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దాడులు నిర్వహిస్తున్నది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న కేసులో దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా (Pulwama), షోపియాన్ (Shopian) జిల్లాల్లో ఉగ్రవాదులతో సంబంధాలున్న వారి ఇండ్లలో సోదాలు చేస్తున్నది. పాకిస్థాన్ ప్రోత్సాహంతో దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఉగ్రసంస్థలకు (Terror groups) నిధులు సమకూరుస్తున్నారని ఎన్ఐఏ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 11న బారాముల్లా జిల్లాలోని కాన్సిపురాకు చెందిన అబ్దుల్ ఖలీక్ రెగో ఇంటిపై, జావిద్ అహ్మద్ ధోబి, షోయబ్ అహ్మద్ చూర్ నివాసాల్లో కూడా అధికారులు తనిఖీ చేశారు.
ఏప్రిల్ 20న పూంచ్ ( Poonch attack) జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు మరణించారు. భింబర్ గలీ నుంచి సాంగ్యోట్ కు ఆర్మీ వాహనం వెళుతుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నవారిని గుర్తించేపనిలో ఎన్ఐఏ అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా మే 9న శ్రీనగర్, కుప్వారా, పూంచ్, రాజౌరితో సహా పలు ప్రాంతాల్లో దాడులు జరిపారు. పాకిస్థాన్ కమాండర్లు, హ్యాండ్లర్ల ఆదేశాల మేర నకిలీ పేర్లతో పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపుల కుట్రను ఛేదించేందుకు అధికారులు సోదాలు నిర్వహించారు. రాజౌరి, పూంచ్ సెక్టార్ల చుట్టూ ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని లంజోట్, నికైల్, కోట్లి, ఖుయిరట్టా ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలు బయటపడ్డాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బాలికపై రోబో లైంగిక వేధింపులు!
యూత్ కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్లోకి దుడ్డు ఆకాశ్
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

