Siddaramaiah | తదుపరి సీఎంపై ఉత్కంఠ.. ఎమ్మెల్యేలతో సిద్ధరామయ్య రహస్య సమావేశాలు..?
Siddaramaiah | కర్ణాటక అసెంబ్లీ (Karnataka Assembly) ఎన్నికల ఫలితాలతో కన్నడ నాట రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి సీఎం ఎవరన్నదానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.
Siddaramaiah | కర్ణాటక అసెంబ్లీ (Karnataka Assembly) ఎన్నికల ఫలితాలతో కన్నడ నాట రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 224 స్థానాలకు గానూ ఏకంగా 135 సీట్లను గెలుచుకుంది. దీంతో ఇప్పుడు తదుపరి ముఖ్యమంత్రి (CM) ఎంపికపై హైకమాండ్ కసరత్తులు చేస్తోంది. కన్నడనాట పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన మాజీ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah), కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) ఇప్పుడు సీఎం పదవికి పోటీ పడుతున్నారు.
ఈ నేపథ్యంలో తదుపరి సీఎం ఎవరన్నదానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం పదవి కోసం మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వేగంగా పాములు కదుపుతున్నారు. తనకే సీఎం పదవి దక్కేలా మద్దతు గల ఎమ్మెల్యేలతో రహస్య సమావేశాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఓ భవనంలో తనకు మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్యేలతో సిద్దు భేటీ నిర్వహించినట్లు సమాచారం. ఈ భేటీకి ఎమ్మెల్యేలు ఎంబీ పాటిల్, జమీర్ అహ్మద్ ఖాన్, ఉత్తర కర్ణాటకకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నట్లు టాక్ వినిపిస్తోంది.
కాగా, కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అదే రోజు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నట్లు వారు వెల్లడించారు. మరోవైపు కొత్త సీఎంకు శుభాకాంక్షలు అంటూ డీకే, సిద్ధు నివాసాల ముందు వారి మద్దతుదారులు బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేశారు.
Also Read..
Manipur | మిజోరంలో ఆశ్రయం పొందుతున్న 5800 మంది మణిపూర్ వాసులు
Gujarat | నకిలీ బిల్లుల అడ్డా గుజరాత్ గడ్డ.. బోగస్ కంపెనీలు సృష్టించి వందల కోట్ల జీఎస్టీ ఎగవేత
Madhya Pradesh | అడవి బిడ్డల అరణ్యరోదన.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ సర్కారు వెన్నుపోటు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ ‘జైలర్ 2’ అరుదైన రికార్డు.. రూ.800 కోట్ల దిశగా పరుగులు, నాలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర!
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

