Omicron in UK | బ్రిటన్‌పై కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ వేరియంట్ విరుచుకుపడుతున్నది. ప్రపంచంలోనే తొలి ఒమిక్రాన్ మరణం నమోదైన యూకేలో రోజురోజుకీ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నది. శుక్రవారంతో పోలిస్తే శనివారం రోజువారీ కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. గత 24 గంటల్లో దాదాపు 90వేల కరోనా కేసులు బయటపడ్డాయి. అయితే అందులో 12వేలకు పైగా కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌వే కావడం గమనార్హం. ఒమిక్రాన్ మరణాలు కూడా ఏడుకు చేరాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం 58,003 కేసులు నమోదవ్వగా.. ఒక్క యూకేలోనే 37,101 కేసులు ఉన్నాయంటే అక్కడ పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
శుక్రవారం నాటి 3,201 కేసులతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువని బ్రిటన్ హెల్త్ ప్రొటక్షన్ ఏజెన్సీ తెలిపింది. ప్రస్తుతం బ్రిటన్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24,968కి చేరాయి. అలాగే ఒమిక్రాన్ బారినపడ్డ వారిలో ఇప్పటి వరకు ఏడుగురు మృత్యువాతపడ్డారు. మరో వైపు కరోనా మరణాల్లో ఇప్పటి వరకు పెరుగుదల మాత్రం నమోదు కాలేదని అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం 111 మంది, శనివారం 125 మంది మృత్యువాతపడ్డారు.
ఇప్పటికే ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి దశకు చేరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ క్రమంలో బ్రిటన్ లాక్డౌన్ దిశగా ఆలోచనలు చేస్తున్నది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ పేర్కొన్నారు. ఒమిక్రాన్ తీవ్రతపై ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని.. వారిచ్చే సమాచారం ఆధారంగా కఠిన లాక్డౌన్ ఆంక్షలు పెట్టాలా లేదా అన్నది నిర్ణయిస్తామని చెప్పారు. పలు యూరోపియన్ యూనియన్ లాక్డౌన్ దిశగా ముందుకెళ్తున్నాయి. స్కాట్లాండ్, వేల్స్ బహిరంగ ప్రదేశాల్లో జనం గుమిగూడడంపై ఆంక్షలు విధించాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కరోనాలా భయపెట్టిన అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
Shining Mask: కొవిడ్ వైరస్ చేరిందో.. ఈ మాస్క్ మెరుస్తుంది! కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు
Omicron | ఒమిక్రాన్‌తో ప్రమాదమెంత.. అధ్యయనంలో కీలక విషయాలు
కొవాగ్జిన్ రెండు డోసులు వేసుకున్నాక.. బూస్టర్ డోస్ కోవిషీల్డ్ వేసుకుంటే ఏమవుతుంది?
Omicron fears | కొవాగ్జిన్.. కొవీషీల్డ్.. వీటిలో బూస్టర్ డోస్‌గా ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది?