Donald Trump | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే నెల 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇక ట్రంప్ విజయంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో తన గెలుపునకు దోహదపడ్డ మస్క్‌కు ట్రంప్ తన క్యాబినెట్లో సముచిత స్థానం కల్పించారు. ‘ఎఫిషియెన్సీ’ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఇక ట్రంప్ 2.0లో మస్క్ పాత్ర కీలకం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అదే సమయంలో మస్క్ అమెరికా అధ్యక్షుడు అవుతాడా..? (Musk Become US President ) అంటూ చర్చ మొదలైంది. ముఖ్యంగా డెమోక్రటిక్ పార్టీ నేతలు ‘ప్రెసిడెంట్ మస్క్’ అంటూ ప్రచారం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అమెరికాకు మస్క్ అధ్యక్షుడు అవుతాడంటూ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మస్క్ ఎప్పటికీ అమెరికా అధ్యక్షుడు కాలేడని వ్యాఖ్యానించారు.
అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్ తొలిసారి అరిజోనాలో ఏర్పాటు చేసిన రిపబ్లికన్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మస్క్ అంశంపై మాట్లాడారు. ‘ఎలాన్ మస్క్ ఎప్పటికీ అధ్యక్షుడు కాలేడు. ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే.. ఆయన అమెరికాలో పుట్టలేదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్ష పదవిని చేపట్టబోయే వ్యక్తి అగ్రరాజ్యంలో జన్మించిన పౌరుడై ఉండాలి. కానీ, మస్క్.. దక్షిణాఫ్రికాలో జన్మించారు. ఆ తర్వాత అమెరికాకు వసల వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు.
Also Read..
“Elon Musk | ఇక ఇతర దేశాల రాజకీయాలపై దృష్టి.. గ్లోబల్ కింగ్‌మేకర్‌గా మస్క్?”
“Elon Musk | ట్రంప్ ప్రచారం కోసం.. ఎలాన్ మస్క్ ఎన్ని వేల కోట్లు ఖర్చు చేశారో తెలుసా?”
“Donald Trump: ఎలన్ మస్క్, వివేక్ రామస్వామికి .. కీలక బాధ్యతలు అప్పగించిన డోనాల్డ్ ట్రంప్”
“Elon Musk | రూ.25.31 లక్షల కోట్లకు.. ట్రంప్ గెలుపుతో భారీగా పెరిగిన మస్క్ సంపద”
“Elon Musk | వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడిపోతారు.. కెనడా ప్రధాని ట్రూడోపై జోష్యం చెప్పిన ఎలాన్ మస్క్”