Elon Musk | అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ (US Presidential Elections 2024) ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) పేరు ప్రముఖంగా హెడ్‌లైన్స్‌లో నిలిచిన విషయం తెలిసిందే. అందుకు కారణంగా.. ఆయన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పూర్తి మద్దతు ఇవ్వడమే. ఇక ఈ ఎన్నికల్లో ట్రంప్‌ను గెలిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau)పై ఎలాన్ మస్క్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరిగే కెనడియన్ ఫెడరల్ ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతారంటూ మస్క్ జోష్యం చెప్పారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విక్టరీ నేపథ్యంలో.. ట్రూడోను వదిలించుకోవడానికి కెనడాకు సాయం చేయండి అంటూ ఓ యూజర్ ఎక్స్‌లో మస్క్‌ను కోరాడు. దీనికి ఈ అమెరికన్ టైకూన్ స్పందిస్తూ.. ‘రాబోయే ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతాడు’ అంటూ బదులిచ్చారు. ట్రంప్‌ను గెలిపించిన మస్క్.. ట్రూడోపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మస్క్ వ్యాఖ్యలతో కెనడాలో లిబరల్ పార్టీ గట్టెక్కడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జస్టిన్ ట్రూడో ఓడిపోవడానికి భారత్‌తో విబేధాలు పెట్టుకోవడం కూడా ఓ కారణంగా పేర్కొంటున్నారు.
కాగా, వచ్చే ఏడాది అక్టోబర్‌లో కెనడా పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఇక గత ఎన్నికల్లో ప్రధాని జస్టిన్ ట్రూడో సారధ్యంలోని లిబరల్ పార్టీ తిరుగులేని విజయం సాధించిన విషయం తెలిసిందే. ట్రూడో వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన పార్టీ సొంతంగా పూర్తి మెజారిటీ సాధించలేకపోయింది. మొత్తం 338 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. ట్రూడో లిబరల్ పార్టీకి 153 మంది సభ్యులు ఉన్నారు. మిత్రపక్షాల మద్దతుతో ఇన్నాళ్లూ ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చారు. ఇప్పుడు నాలుగోసారి అధికారం కోసం ట్రూడో సిద్ధమవుతున్నారు.
అయితే, ప్రస్తుతం ట్రూడో తీరుపై సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలకు చేసే సన్నాహాలు దారుణంగా ఉన్నాయని ఎంపీలు అభిప్రాయడ్డారు. ఈ క్రమంలోనే గత నెల ట్రూడోకు లిబరల్ పార్టీ ఎంపీలు అల్టిమేటం కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమిని ఊహించి రాజీనామా చేయాల్సిందిగా ప్రధానిని కోరారు. మరోవైపు కెనడా చరిత్రలో గత 100 ఏళ్లలో ఏ నాయకుడూ నాలుగోసారి గెలిచిన దాఖలాలు లేవు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని లిబరల్ ఎంపీలు.. ట్రూడోను రాజీనామా చేయాల్సిందిగా కోరినట్లు గత నెలలో వార్తలు వచ్చాయి.
Also Read..
Sunita Williams | క్షీణించిన సునీతా విలియమ్స్ ఆరోగ్యం..? క్లారిటీ ఇచ్చిన నాసా
Salman Khan | సల్మాన్‌కు మరోసారి బెదిరింపులు.. ధైర్యం ఉంటే వారిని రక్షించుకోవాలంటూ హెచ్చరిక
PM Modi | సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు