Sunita Williams | అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న భారతీయ అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ (Sunita Williams) ఆరోగ్యంపై ఇటీవలే ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే (concerns over Sunita Williams health). ఐఎస్ఎస్లో సునీతా విలియమ్స్ బరువు తగ్గినట్లుగా, నీరసంగా ఉన్నట్లు ఓ ఫొటో ఇటీవలే బయటకు వచ్చింది. దీంతో ఆమె తీవ్ర పోషకార లోపాన్ని ఎదుర్కొంటున్నారని, అందువల్లనే ఆమె బలహీనంగా కనిపిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.
దీంతో సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అయింది. ఈ వార్తలపై నాసా (NASA) తాజాగా స్పందించింది. ఆస్ట్రోనాట్ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చింది. సునీతా విలియమ్స్ సహా అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములంతా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపింది. వ్యోమగాములకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు జరుగుతాయని, ఫ్లైట్ సర్జన్లు పర్యవేక్షిస్తారని వెల్లడించింది.
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ ఈ ఏడాది జూన్ 5న బోయింగ్ స్టార్‌లైన్ స్పేస్‌షిప్‌లో ఐఎస్ఎస్కి వెళ్లారు. ఆ తర్వాత స్టార్‌లైర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ తిరి భూమికిపైకి చేరుకోవడంలో ఆలస్యమైంది. ఇద్దరు వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకువచ్చేందుకు నాసా ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 2025లో తిరిగి భూమికి తీసుకురానున్నట్లు పేర్కొంది. ఇందు కోసం స్పేస్ ఎక్స్‌కు చెందిన కార్గో వెర్షన్‌ని ప్రయోగించింది. స్పేస్ఎక్స్ నాసా 31వ కమర్షియల్ రీసప్లై సర్వీసెస్ మిషన్‌గా పిలుస్తారు. ఈ రీసప్లై సర్వీసెస్ మిషన్ కింద సౌర గాలి, రేడియేషన్, స్పేస్‌క్రాఫ్ట్ మెటీరియల్స్, అంతరిక్షంలో కోల్డ్ వెల్డింగ్పై పరిశోధనలు చేయబోతున్నారు.
Also Read..
Salman Khan | సల్మాన్‌కు మరోసారి బెదిరింపులు.. ధైర్యం ఉంటే వారిని రక్షించుకోవాలంటూ హెచ్చరిక
Susan Wiles: వైట్‌హౌజ్ మేనేజర్‌ను నియమించిన డోనాల్డ్ ట్రంప్
BRS | సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటన.. బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులు