California wildfires : దక్షిణ కాలిఫోర్నియా (Southern california) కార్చిచ్చుపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన (US President elect) డొనాల్డ్ ట్రంప్ (Donald trump) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అమెరికా చరిత్రలో చోటుచేసుకున్న అత్యంత దారుణమైన విపత్తుల్లో ఈ కాలిఫోర్నియా కార్చిచ్చు ఒకటని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్టు పెట్టారు.
‘లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. వాటిని ఎలా అదుపు చేయాలో రెస్క్యూ టీమ్స్‌కు అంతుబట్టడం లేదు. ఇప్పటికే పలు ఇళ్లు కాలిపోయాయి. ఇంకా చాలా ఇళ్లు కాలిపోయే ప్రమాదం ఉంది. ఆ ప్రదేశం అంతా మరుభూమిలా మారింది. దేశ చరిత్రలో ఇదే అత్యంత దారుణమైన విపత్తు. వాళ్లు మంటలను అదుపు చేయలేకపోతున్నారు. అందులో వాళ్ల తప్పేముంది..?’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
గత కొన్ని రోజులుగా రగులుతున్న ఈ కాలిఫోర్నియా కార్చిచ్చులో ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారని అక్కడి మీడియా పేర్కొంది. దాదాపు 2 లక్షల మంది నిరాశ్రయులైనట్లు తెలిపింది. దాదాపు 10 వేల ఇళ్లు ఆ మంటల్లో కాలిపోయినట్లు వెల్లడించింది. మొత్తంగా 35 వేల ఎకరాల విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయని, ఇది పరిమాణంలో మ్యానహట్టన్ కంటే రెండున్నర ఇంతలు ఎక్కువని యూఎస్ మీడియా పేర్కొంది.
Cash Transactions | నగదు లావాదేవీలను తగ్గించండి.. లేదంటే జేబుకు చిల్లే..!
Kite festival | రంగురంగుల పతంగులు.. రకరకాల డిజైన్లు.. అలరించిన కైట్ ఫెస్టివల్
Indonesia President | భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు..!
S. Jaishankar | భారత్ తరఫున ట్రంప్ ప్రమాణస్వీకారానికి వెళ్లనున్న విదేశాంగ మంత్రి జైశంకర్
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
Health Tips | మిమ్మల్ని నెలసరి సమస్య ఇబ్బంది పెడుతోందా.. అయితే తరచూ ఈ పండు తినండి..!