Cash Transactions : దేశంలో ఇప్పటికీ డిజిటల్ లావాదేవీల (Digital transactions) కంటే నగదు లావాదేవీలే (Cash transactions) ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే ప్రజలను డిజిటల్ లావాదేవీల వైపు మళ్లించడానికి ఆదాయపన్ను శాఖ (Income tax department) కీలక నిర్ణయాలు తీసుకుంది. పెద్ద మొత్తంలో జరిగే నగదు లావాదేవీలపై ఆంక్షలు విధించింది. కొన్ని రకాల నగదు లావాదేవీలపై ఏకంగా 100 శాతం వరకు పెనాల్టీ విధించనున్నట్లు తెలిపింది.
ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 269ST సహా మరికొన్ని సెక్షన్ల కింద పరిమితికి మించి నగదు లావాదేవీలు చేస్తే నోటీసులతో పాటు పెనాల్టీ పడే అవకాశం ఉంది. ఇప్పుడు 2025-26 సంవత్సరానికి సంబంధించి జూలై 31లోగా ఆదాయపుపన్ను రిటర్న్స్ ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 100 శాతం వరకు పెనాల్టీ పడే అవకాశం ఉన్న నగదు లావాదేవీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
2. బ్యాంకు నుంచి ఒకే రోజు రూ.2 లక్షలకు మించి నగదును తీసుకోవడానికి వీల్లేదు. సెక్షన్ 269ST ప్రకారం రూ.2 లక్షలకు మించి నగదును తీసుకుంటే అంతే మొత్తంలో జరిమానా పడే ఛాన్స్ ఉంది.
3. లోన్లు, డిపాజిట్ల కింద తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించేటప్పుడు రూ.20 వేల వరకే నగదు రూపంలో చెల్లించవచ్చు. అంతకు మించి చేస్తే సెక్షన్ 269T ప్రకారం 100 శాతం పెనాల్టీ పడుతుంది.
4. వ్యాపారానికి సంబంధించిన నగదు లావాదేవీలను రూ.10 వేలకు మించి చేయకూడదు. రూ.10 వేలకు మించి నగదు లావాదేవీలు చేస్తే సెక్షన్ 40A(3) ప్రకారం పెనాల్టీ పడే ఛాన్స్ ఉంది.
5. ఐటీ యాక్ట్, సెక్షన్ 80G ప్రకారం రూ.2 వేలకు మించి నగదు రూపంలో విరాళాలను తీసుకోకూడదు. అలాచేస్తే ఐటీ రిటర్న్స్ క్లెయిమ్ చేసుకోలేరు. పైగా పెనాల్టీ కట్టాల్సి వస్తుంది.
Kite festival | రంగురంగుల పతంగులు.. రకరకాల డిజైన్లు.. అలరించిన కైట్ ఫెస్టివల్
Indonesia President | భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు..!
S. Jaishankar | భారత్ తరఫున ట్రంప్ ప్రమాణస్వీకారానికి వెళ్లనున్న విదేశాంగ మంత్రి జైశంకర్
Encounter | ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
Crime news | మహిళ దారుణ హత్య.. 10 నెలలుగా ఫ్రిజ్లోనే మృతదేహం..!
Health Tips | మిమ్మల్ని నెలసరి సమస్య ఇబ్బంది పెడుతోందా.. అయితే తరచూ ఈ పండు తినండి..!