S. Jaishankar : డొనాల్డ్ ట్రంప్ (Donald trump) ఈ నెల 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా (47వ అధ్యక్షుడిగా) ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత్ తరఫున విదేశాంగ మంత్రి ( External Affairs Minister) ఎస్ జైశంకర్ (S Jaishankar) హాజరుకానున్నారు. ట్రంప్ ప్రమాణస్వీకార నిర్వహణ కమిటీ ఆహ్వానం మేరకు భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో ప్రమాణస్వీకారానికి ఒకరోజు ముందే జైశంకర్ అమెరికాకు వెళ్లనున్నారు.
ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడించింది. జైశంకర్ కేవలం ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి మాత్రమే అమెరికాకు వెళ్లడంలేదని, ఈ సందర్భంగా అమెరికా నూతన పాలకవర్గంతో ఆయన చర్చలు జరుపుతారని అన్నారు. అదేవిధంగా ట్రంప్ ప్రమాణస్వీకారానికి హాజరయ్యే ఇతర దేశాల అధినేతలతో కూడా జైశంకర్ చర్చించే అవకాశం ఉందని చెప్పారు.
ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినట్లు ఈ నెల 6న అమెరికన్ కాంగ్రెస్ సర్టిఫై చేసింది. ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌కు 312 ఎలక్టోరల్ ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి, డెమోక్రాట్స్ అభ్యర్థి, ఆమెరికా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌కు 226 ఓట్లు వచ్చాయి. కాగా ట్రంప్‌పై కమలాహారిస్‌కు బదులుగా తాను పోటీచేసి ఉంటే గెలిచేవాడినని ఇటీవల అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
Water Ambulance | మహా కుంభమేళా వేళ అందుబాటులోకి వాటర్ అంబులెన్స్ సేవలు..Video
Crime news | మహిళ దారుణ హత్య.. 10 నెలలుగా ఫ్రిజ్లోనే మృతదేహం..!
Health Tips | మిమ్మల్ని నెలసరి సమస్య ఇబ్బంది పెడుతోందా.. అయితే తరచూ ఈ పండు తినండి..!