Water Ambulance : రేపటి నుంచి అంటే జనవరి 13 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 26 వరకు 45 రోజులపాటు ఈ మహాకుంభమేళా కొనసాగనుంది. 144 ఏండ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ప్రపంచ దేశాల నుంచి దాదాపు 40 కోట్ల మంది ఈ మహా కుంభమేళాకు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
అందుకు తగినట్లుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సన్యాసులు కుంభమేళా ప్రాంతానికి చేరుకున్నారు. ఈ మహాకుంభమేళా సందర్భంగా భక్తుల్లో ఎవరి ఏ ఆపద వచ్చినా తక్షణమే వైద్యు సదుపాయం కల్పించాలనే ఉద్ధేశంతో జాతీయ విపత్తు నిర్వహణ దళం (NDRF) వాటర్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎవరు అస్వస్థతకు గురైనా ఈ వాటర్ అంబులెన్స్‌లో ప్రాథమిక చికిత్స అందించనున్నారు.
#WATCH | Prayagraj, Uttar Pradesh: Water ambulance service has been started by NDRF in view of the safety of devotees during Maha Kumbh 2025. pic.twitter.com/MFsRZ2n4e4
— ANI (@ANI) January 12, 2025
Fire accident | కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. Video
Crime news | మహిళ దారుణ హత్య.. 10 నెలలుగా ఫ్రిజ్లోనే మృతదేహం..!
Health Tips | మిమ్మల్ని నెలసరి సమస్య ఇబ్బంది పెడుతోందా.. అయితే తరచూ ఈ పండు తినండి..!