Fire accident : ఆదివారం ఉదయాన్నే ఓ కెమికల్ ఫ్యాక్టరీ (Chemical factory) లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ఫ్యాక్టరీ జనావాసాలకు దూరంగా శివార్లలో ఉండటం.. ఇవాళ ఆదివారం కావడంతో ఉద్యోగులు, కార్మికులు ఫ్యాక్టరీలో లేకపోవడం కారణంగా పెనుముప్పు తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే సెక్యూరిటీ సిబ్బంది స్థానిక పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. అయితే ఆస్తినష్టం భారీగానే జరిగిందని అన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. గ్రేటర్ నోయిడాలోని గౌతమ్బుద్ధనగర్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది.
#WATCH | Greater Noida, UP | A fire breaks out at a chemical factory in Badalpur PS area. Fire tenders present at the spot and efforts to douse the fire are underway. No casualties reported.
(Source: Police Commissionerate Gautam Buddh Nagar) pic.twitter.com/QUVGZuOMZt
— ANI (@ANI) January 12, 2025
Crime news | మహిళ దారుణ హత్య.. 10 నెలలుగా ఫ్రిజ్లోనే మృతదేహం..!
Health Tips | మిమ్మల్ని నెలసరి సమస్య ఇబ్బంది పెడుతోందా.. అయితే తరచూ ఈ పండు తినండి..!