Arvind Kejriwal : ఇటీవల ఢిల్లీ సీఎం (Delhi CM) అతిషి సింగ్ (Atishi Singh) గురించి, కాంగ్రెస్ నాయకురాలు (Congress leader) ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేశ్ బిధూరీ (Ramesh Bidhuri) నే బీజేపీ తన సీఎం అభ్యర్థిగా ప్రకటించనుందట. ఈ విషయాన్ని ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వెల్లడించారు. రాబోయే ఒకటి రెండు రోజుల్లో బీజేపీ తన సీఎం అభ్యర్థిగా రమేశ్ బిధూరీ పేరును అధికారికంగా ప్రకటించనున్నట్టు తమకు సమాచారం ఉన్నదని కేజ్రీవాల్ చెప్పారు.
‘బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటితం కాబోతున్న రమేశ్ బిధూరీకి నా అభినందనలు. అయితే ఆయన ఒక ఎంపీగా ఢిల్లీ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలి. ఢిల్లీ పట్ల ఆయనకున్న విజన్ ఏమిటో వెల్లడించాలి. ఆయన పేరును బీజేపీ అధికారికంగా ప్రకటించిన తర్వాత ఢిల్లీ ప్రజల ముందు బీజేపీ, ఆప్ సీఎం అభ్యర్థుల మధ్య చర్చ జరగాలి’ అని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. కాగా ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఓకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడించనున్నారు.
Assam coal mine | అస్సాం బొగ్గు గని నుంచి మూడు మృతదేహాలు వెలికితీత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Viral Video | బైక్పై యువ జంట రొమాన్స్.. వీడియో వైరల్