Viral Video | గత కొన్నిరోజులుగా యువత రెచ్చిపోతున్నారు. పబ్లిక్‌గానే హద్దులుమీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఎవరున్నారనేది కూడా చూడకుండా.. అదేదో ఫ్యాషన్ అన్నట్లు పబ్లిక్‌గానే రొమాన్స్ చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. ఇటీవలే కాలంలో ఇలాంటి ఘటనలు అనేకం వెలుగుచూశాయి. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
కాన్పూర్ (Kanpur)లో ఓ జంట బైక్‌పై రొమాన్స్ చేస్తూ (romancing on moving bike) కెమెరా కంటికి చిక్కింది. యువతి బైక్ ముందు భాగంలో ఉన్న పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చోగా.. యువకుడు బైక్ నడుపుతూ కనిపించాడు. ఆ సమయంలో ఇద్దరూ మితిమీరిన రొమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కారు. ఆవాస్ వికాస్ (Awas Vikas) ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కాన్పూర్ పోలీసులు స్పందించారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#कानपुर चलती बाइक पर रोमांस करते कपल का वीडियो वायरल..
गंगा बैराज के पास का बताया जा रहा है वायरल वीडियो। #kanpur #viralvideo #sirfsuch #news pic.twitter.com/xi5zdCkde5
— ठाkur Ankit Singh (@liveankitknp) January 10, 2025
Also Read..
Monkey | మహిళ తలపైకి ఎక్కి.. షాపింగ్ మాల్లో గందరగోళం సృష్టించిన కోతి.. VIDEO
Watch: బెడిసికొట్టిన స్టంట్.. ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి, వీడియో వైరల్