లక్నో: ట్రాక్టర్లతో స్టంట్ బెడిసికొట్టింది. (Tractor Stunt) అదుపుతప్పి ఒక ట్రాక్టర్ బోల్తాపడింది. దాని కింద నలిగి డ్రైవర్ మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జనవరి 4న ఆ జిల్లాలోని ఒక గ్రామంలో ట్రాక్టర్లతో స్టంట్ నిర్వహించారు. తేజ్వీర్, కలువా ఈ పోటీలో పాల్గొన్నారు. తాడుతో కట్టిన రెండు ట్రాక్టర్లను వెనక్కి లాగేందుకు వారిద్దరూ ప్రయత్నించారు.
కాగా, తేజ్వీర్ ట్రాక్టర్‌ను కలువా నడిపే ట్రాక్టర్ చాలా మీటర్ల దూరం విజయవంతంగా వెనక్కి లాగింది. ఇది చూసి అక్కడున్న జనం కేరింతలు కొట్టారు. అయితే తేజ్వీర్ ట్రాక్టర్ అదుపుతప్పింది. మట్టిరోడ్డు నుంచి పక్కకు దూసుకెళ్లి బోల్తాపడిండి. దానిని నడిపిన తేజ్వీర్ ఆ ట్రాక్టర్ కిందపడి నలిగి మరణించాడు. అక్కడున్న వారు పరుగున అతడి వద్దకు వెళ్లారు. రక్తం మడుగుల్లో తేజ్వీర్ చనిపోవడాన్ని చూశారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై దర్యాప్తు చేశారు. ట్రాక్టర్ స్టంట్‌లో మరణించిన డ్రైవర్ తేజ్వీర్ మృతదేహానికి గ్రామస్తులు గుట్టుగా అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలుసుకున్నారు. అందుకే ఈ సంఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీస్ అధికారి తెలిపారు. అయినప్పటికీ వీడియో క్లిప్ ఆధారంగా మరో ట్రాక్టర్ డ్రైవర్ కలువాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రాణాలు హరించే ఇలాంటి స్టంట్లు చేయవద్దని పోలీసులు సూచించారు.
Daring stunt took a tragic turn when a tractor, pulled by ropes during a show, flipped over.
The driver was tragically crushed to death on the spot in Dibai, Bulandshahr (UP).
We owe it to our society to put a stop to such reckless acts before they become a normalized thrill,… pic.twitter.com/Cq3aVHBA38
— Sneha Mordani (@snehamordani) January 9, 2025