Monkey | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం ఝాన్సీ (Jhansi)లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నగరంలోని సిటీ కార్ట్ మాల్ (Citykart Mall)లోకి ప్రవేశించిన ఓ కోతి (Monkey) అక్కడ గందరగోళం సృష్టించింది. మాల్లోని సిబ్బందిని పరుగులు పెట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఝాన్సీలోని సిటీ కార్ట్ మాల్‌లోకి ఓ కోతి ప్రవేశించింది. అక్కడ ఓ మహిళ తలపైకి ఎక్కి దాడి చేసింది. యువతిని గోర్లతో గీకడం, తల లాగడం వంటివి చేసింది. పదేపదే ఆమెపై దాడి చేసింది. ఆమె కాళ్లకున్న షూను లాగేసింది. ఈ ఘటనతో సిబ్బంది, కస్టమర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కోతిని బంధించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అరటిపండు ఆశ చూపారు. దుప్పటితో దాన్ని బంధించాలని ప్రయత్నించారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఆ కోతి వారికి చిక్కకుండా మాల్లోని స్టాండ్లపై గెంతులేస్తూ గందరగోళం సృష్టించింది. సిబ్బందిని పరుగులు పెట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
झांसी के मॉल में बंदर ने मचाया उत्पात…
एक युवती को जमकर किया परेशान
चीखती नजर आई युवती,वीडियो हुआ वायरल#Jhansi #UPNews #ViralVideo pic.twitter.com/efQRvkLDTu
— News1India (@News1IndiaTweet) January 11, 2025
Also Read..
Joe Biden | అధ్యక్ష ఎన్నికల్లో నిలబడి ఉంటే.. ట్రంప్‌ను కచ్చితంగా ఓడించేవాడిని : జో బైడెన్
Pantangi Toll Plaza | సంక్రాంతికి సొంతూళ్లకు.. పంతంగి టోల్ ప్లాజా వద్ద గంటకు 900 వాహనాలు క్రాస్
KL Rahul: కేఎల్ రాహుల్ సెలక్షన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన బీసీసీఐ కమిటీ